Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీ బ్యాట్‌కి సచిన్ టేపు వేసిన వేళ: సెంచరీతో మెరిసిన దాదా

When Sachin Tendulkar Taped Sourav Ganguly's Bat During Lord's Test

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో తన తొలి టెస్టు అనుబంధాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి గుర్తు చేసుకున్నాడు. గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పుస్తకంలో తన క్రికెట్ కెరీర్‌లో చోటు చేసుకున్న అనేక విషయాల్ని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

తొలి టెస్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్‌

తొలి టెస్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్‌

తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్యూలో సచిన్‌ టెండూల్కర్‌తో తన తొలి టెస్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్‌ను వెల్లడించాడు. 1996లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌‌ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఇది సౌరవ్ గంగూలీకి తొలి టెస్టు.

ఆరు గంటల పాటు బ్యాటింగ్‌ చేశా

ఆరు గంటల పాటు బ్యాటింగ్‌ చేశా

'ఈ మ్యాచ్‌ ద్వారానే నేను టెస్టుల్లోకి అరంగేట్రం చేశా. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. తరువాత మేం బ్యాటింగ్‌ చేస్తున్నాం. ఓపెనర్‌ విక్రమ్‌రాథోర్‌ ఔటవ్వడంతో నేను బ్యాటింగ్‌కు దిగాను. నేను టీ సమయానికి సెంచరీ చేశా. అప్పటికి ఆరు గంటల పాటు బ్యాటింగ్‌ చేసి ఉన్నా' అని గంగూలీ తెలిపాడు.

సచిన్‌ నా దగ్గరకు వచ్చి ఇలా

సచిన్‌ నా దగ్గరకు వచ్చి ఇలా

'టీ బ్రేక్‌లో ప్యాడ్లు తీసి కూర్చొన్న సమయంలో నా వద్దకు ఒక కప్‌ టీ వచ్చింది. అది తాగుతూనే నా బ్యాట్‌ హ్యాండిల్‌ను సరిచేసుకునే పనిలో పడ్డా. నా బ్యాట్‌ హ్యాండిల్‌కు కొంచెం పగుళ్లు వచ్చాయి. దీంతో నేను దానికి టేప్‌ వేసుకునే పనిలో నిమగ్నమయ్యాను. అప్పుడు సచిన్‌ నా దగ్గరకు వచ్చాడు' అని దాదా పేర్కొన్నాడు.

నువ్వు టీ తాగు, ఆ బ్యాట్ సంగతి నేను చూస్తా

నువ్వు టీ తాగు, ఆ బ్యాట్ సంగతి నేను చూస్తా

'ఆ బ్యాట్‌ పని నేను చూస్తా. నువ్వు టీ తాగు. నువ్వు మళ్లీ వెళ్లి బ్యాటింగ్‌ చేయాలి కదా అని చెప్పి నా బ్యాట్‌కు తానే స్వయంగా టేప్‌ వేశాడు. అంతేకాదు ఎక్కువ ఆందోళన తీసుకోవద్దు అని కూడా సూచించాడు' అని తన బ్యాట్‌కు సచిన్‌ టేప్‌ వేసిన విషయాన్ని గంగూలీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గంగూలీ 131 పరుగులు సాధించాడు. అలాగే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. ఈ టెస్టు డ్రాగా ముగియడం విశేషం.

Story first published: Friday, March 2, 2018, 13:03 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+