Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ సూపర్ క్యాచ్.. అవాక్కయిన ఇంజిమామ్!!

When Sachin Tendulkar stunned Inzamam-ul-Haq by taking absolute blinder

హైదరాబాద్: సచిన్‌ టెండూల్కర్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్‌ గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. తన మాయాజాలంతో దేశానికి ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు. అదే సమయంలో మైదానంలో సచిన్‌ పాదరసంలా కదులుతాడు. స్లిప్, మిడిల్, బౌండరీ వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. అయితే 2004లో ఓ సూపర్ క్యాచ్‌తో మ్యాచ్‌ని ఒక్కసారిగా భారత్‌ వైపు తిప్పాడు.

భారీ షాట్ఆడిన ఇంజిమామ్:

భారీ షాట్ఆడిన ఇంజిమామ్:

2004లో పాకిస్థాన్‌తో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడింది. లాహోర్ వేదికగా జరిగిన ఐదో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ దక్కుతుంది. ఆ సిరీస్‌లో అప్పటికే విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్.. ఐదో వన్డేలోనూ బ్యాట్ జుళిపిస్తున్నాడు. సరిగ్గా ఈ సమయంలో మాస్టర్ బ్లాస్టర్ మాయ చేసాడు. లక్ష్య ఛేదనలో ఇంజిమామ్ 38 పరుగుల వద్ద ఉండగా.. స్పిన్నర్ మురళీ కార్తీక్ బౌలింగ్‌లో సిక్స్ కోసం ప్రయత్నించాడు.

సచిన్ సూపర్ క్యాచ్:

సచిన్ సూపర్ క్యాచ్:

కార్తీక్ బౌలింగ్‌లో ఇంజిమామ్ భారీ షాట్ ఆడాడు. సిక్స్‌గా వెళ్లినట్లు కనిపించిన బంతి సచిన్ చేతుల్లో పడింది. సచిన్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అంతేకాదు చాకచక్యంగా తన పాదాలు లైన్‌ని తాకకుండా చూసుకున్నాడు. క్యాచ్ అందుకోగానే సచిన్ మైదానంలో పరుగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు అందరూ సచిన్‌ను ప్రశంసించారు. మరోవైపు సచిన్ సూపర్ క్యాచ్‌ను చూసిన ఇంజీ (38: 51 బంతుల్లో 5x4) ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆపై బాధగా పెవిలియన్ చేరాడు.

లక్ష్మణ్ సెంచరీ:

లక్ష్మణ్ సెంచరీ:

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్ (20), సచిన్ (37) నిరాశపరిచిచారు. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (107: 104 బంతుల్లో 11x4) సెంచరీతో టీమిండియాకు భారీ పరుగులు అందించాడు. లక్ష్య ఛేదనలో షోయబ్ మాలిక్ (65: 89 బంతుల్లో 3x4, 1x6), మొయిన్ ఖాన్ (72: 71 బంతుల్లో 5x4, 1x6) ఆదుకునే ప్రయత్నం చేసారు. చివరికి పాక్ 47.5 ఓవర్లలో 253 పరుగులకి ఆలౌటైంది. భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొంది. ఐదు వన్డేల సిరీస్‌ 3-2తో సొంతమైంది.

Story first published: Wednesday, May 6, 2020, 18:59 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+