బ్యాట్ నాతో మాట్లాడుతుంది: సచిన్, ఆశ్చర్య పోయిన బ్రావో, పొలార్డ్
హైదరాబాద్: బ్యాట్ తన బాషలో తనతో మాట్లాడుతుందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అంతేకాదు బ్యాట్ నుంచి వచ్చే శబ్ధాన్ని బట్టిన బ్యాట్ నాణ్యతను ఇట్టే గుర్తిస్తానని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ముంబైలోని బాంద్రాలో క్రీడా పరికరాలు, స్పోర్ట్స్‌వేర్ 'సచిన్ బై స్పార్టాన్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు.
సచిన్ మీడియాతో మాట్లాడుతూ తనలో ఉన్న ఈ టాలెంట్‌ని చూసి వెస్టిండిస్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌లు ఆశ్చర్యచకితులయ్యారని అన్నాడు. 'తన చేతివేలుతో బ్యాట్ నుంచి వచ్చే శబ్దాన్ని చెక్ చేస్తున్న సయమంలో డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌లు నన్ను ఏమి చేస్తున్నావని అడిగారు. అప్పుడు నేను వాళ్లతో బ్యాట్ నాతో మాట్లాడుతుంది' అని చెప్పానని సచిన్ అన్నాడు.

ఏది నాణ్యమైన బ్యాటో చెక్ చేయమన్నారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా నాలుగు బ్యాట్లు తన వద్దకు తీసుకొచ్చి వీటిలో ఏది నాణ్యమైన బ్యాటో చెక్ చేయమని అడిగారన్నాడు. తన చేతి వేలుతో బ్యాట్లను చెక్ చేసి, వారు తీసుకొచ్చిన బ్యాట్లు ఏమంత గొప్పగా లేవని చెప్పానని అన్నాడు.

ప్రాక్టీస్ బ్యాట్ అని చెప్పి అసలైన బ్యాట్
ఆ తర్వాత మరొకసారి వారి వెంట తీసుకొచ్చిన బ్యాట్‌ని ప్రాక్టీస్ బ్యాట్ అని చెప్పి దాని నాణ్యతను చెక్ చేయమని అడిగారని సచిన్ తెలిపాడు. ఆ బ్యాట్‌ని తాను చెక్ చేసి ఇదే అసలు బ్యాట్ అని చెప్పడంతో వారిద్దరూ ఆశ్చర్యానికి గురయ్యారని సచిన్ చెప్పాడు.

200 టెస్టులు, 463 వన్డేలాడి 34,000 పరుగులు
అనంతరం తనని టెస్టు చేసేందుకు గాను నాలుగు బ్యాట్లను ఆర్డర్‌లో పెట్టి సరైన బ్యాట్‌ని సెలక్ట్ చేయాలని సూచించారని సచిన్ తెలిపాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలాడి 34,000 పరుగులు సాధించాడు.

ఆ ఒక్క క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే
ప్రపంచ క్రికెట్‌లో 100 సెంచరీలు (వన్డేల్లో 49, టెస్టుల్లో 51) సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఈ బ్యాటింగ్ రికార్డులను ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా అధిగమించకపోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications