Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్ష్మణ్‌పై సచిన్ ఆగ్రహం: ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? (వీడియో)

When Sachin Tendulkar Shouted At VVS Laxman And Got Scolded Back Home

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు తన సోదరుడితో తిట్లుతిన్నానని క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. మంగళవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో ముంబైకి సచిన్‌, సన్‌రైజర్స్‌కు లక్ష్మణ్‌ మెంటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌, సచిన్ టెండూల్కర్‌లు సైతం హాజరయ్యారు. ఇందులో భాగంగా మ్యాచ్ ప్రరంభానికి ముందు ఈ ఇద్దరూ బీసీసీఐ టీవీకి ఇంటర్యూ ఇచ్చారు..

సచిన్‌ను ప్రశ్నలడిగిన వీవీఎస్ లక్ష్మణ్

సచిన్‌ను ప్రశ్నలడిగిన వీవీఎస్ లక్ష్మణ్

ఈ సందర్భంగా సచిన్‌ను వీవీఎస్ లక్ష్మణ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ ఇంటర్యూలో కోకకోలా కప్‌-1998లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పలు విషయాలను విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా సచిన్‌ మ్యాచ్‌ మధ్యలో లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాడు.

లక్ష్మణ్‌కు అప్పుడే క్షమాపణలు చెప్పా

ఇంటికెళ్లాక తన సోదరుడితో తిట్లు తిన్నానని 'అతను నీ సహచర ఆటగాడు. అతను నీకు మద్దతునిస్తే.. నువ్వు అతనిపై అరిచావు' అని తన సోదరుడు మందలించినట్లు సచిన్‌ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై లక్ష్మణ్‌కు అప్పుడే క్షమాపణలు చెప్పానని, మళ్లీ మైదానంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని సచిన్ అన్నాడు.

 వాంఖడే మైదానం ఎంతో ప్రత్యేకం

వాంఖడే మైదానం ఎంతో ప్రత్యేకం

ముంబై వాంఖడే మైదానం తనకు ప్రత్యేకమని సచిన్‌ అన్నాడు. 'ఈ మైదానం నాకు ప్రత్యేకం. నేనిక్కడి నుంచే నా ఆటను ప్రారంభించా. ఫ్టస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఇక్కడే అరంగేట్రం చేశా. 2011 ప్రపంచకప్‌ ఇక్కడే గెలిచాం. నా వీడ్కోలు మ్యాచ్‌ సైతం ఈ మైదానంలోనే జరిగింది. అందుకే వాంఖేడే నా జీవితంలో ప్రత్యేకమైన మైదానం' అని సచిన్‌ తెలిపాడు.

నాన్‌ స్ట్రైకర్‌గా సచిన్‌ ఇన్నింగ్స్ చూడటం అదృష్టం

నాన్‌ స్ట్రైకర్‌గా సచిన్‌ ఇన్నింగ్స్ చూడటం అదృష్టం

ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ నాన్‌ స్ట్రైకర్‌గా సచిన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ చూడటం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. 'ఇది క్రికెట్‌లోనే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌(143) సెంచరీ చేసిన భారత్‌ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Story first published: Wednesday, April 25, 2018, 19:25 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+