Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆ చిన్నారి పట్ల సచిన్ అద్భుతం సృష్టించాడు'

When Sachin Tendulkar miraculously healed a disabled child

హైదరాబాద్: అభిమానం అవధులు దాటినా కొన్ని సార్లు మేలే జరుగుతుంది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ విషయంలో ఇది అక్షరాలా రుజువైంది. అభిమానం ఇచ్చే బలం ఎంతటి పనైనా చేసేందుకు తోడ్పడుతుందని ఓ చిన్నారిపై చూపిన ప్రేమతో సచిన్ నిరూపించాడు. దాదాపు 80 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న పదకొండేళ్ల పిల్లాడ్ని.. ఇక జీవితంలో నడవలేడని వైద్యులు తేల్చిచెప్పేశారు.

సచిన్‌ను చూడగానే లేచి నిలుచొని అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. ఎప్పుడో జరిగిన ఈ ఉదంతం గురించి బోరియా మజుందార్‌ అనే రచయిత తన 'లెవెన్‌ గాడ్స్‌ అండ్‌ ఏ బిలియన్‌ ఇండియన్స్‌' పుస్తకంలో రాశారు. సచిన్‌ పుట్టినరోజు (మంగళవారం) సందర్భంగా సోమవారం ఈ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించారు.

సచిన్‌తోపాటు టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, ఆస్ర్టేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఈ కార్యక్రమానికిహాజరయ్యారు. 'చాలా ఏళ్ల క్రితం చెన్నైలోని చైల్డ్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ బాలుడు నడవలేడని డాక్టర్లు చెప్పిన విషయం సచిన్‌కు తెలియదు. దీంతో ఆ బాలుడి వద్దకు వెళ్లి అతడి చేతికి బ్యాట్‌ ఇచ్చి ఆడమన్నాడు. ఆ బాలుడు లేచి సచిన్‌ విసిరిన మూడు బంతులు ఆడాడు' అని మజుందార్‌ వివరించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టెండూల్కర్ సాధించిన 35 వేల పరుగులు, వంద సెంచరీలు పక్కన పెడితే ఆ చిన్నారి లేచి నిల్చొని చేసేలా తోడ్పడిన అతనిపై ఉన్న అభిమానం గొప్ప రికార్డు వంటిదని ఆయన పేర్కొన్నాడు. 75-80శాతం వరకూ లేచి నిలబడలేడని తేల్చేసిన మాస్టర్‌ను మాస్టర్ బ్లాస్టర్ నిలబెట్టాడు.

Story first published: Tuesday, April 24, 2018, 10:07 [IST]
Other articles published on Apr 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+