ముంబై: మ్యూజిక్ మేస్ట్రో, అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌కు క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆతిథ్యమిచ్చాడు. ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా రహమాన్, సచిన్ పాల్గొన్నారు.

'వారాంతం మ్యూజిక్ మేస్ట్రోను కలిశాను. రెహమాన్‌కి ఆతిథ్యమివ్వడం ఆనందానికి గురిచేసింది. కబుర్లు, భోజనంతో ఆహ్లాదకరంగా గడిపాం' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. రెహమాన్‌తో ముచ్చట్ల ఫోటోను కూడా పోస్టు చేశాడు.
కాగా, శనివారం రోజు రాఖీ పూర్ణిమ పర్వదినం సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకుంటూ దిగిన ఫొటోను కూడా సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.