Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్‌ అలా అనగానే.. నా య‌ద‌లో వేయి వీణ‌లు మోగిన‌ట్లు అనిపించింది: శాంసన్‌

When Rahul Dravid asked Sanju Samson, Would you play for my team?

కేరళ: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ 'నా జ‌ట్టులో ఆడుతావా' అని అడిగిన సంద‌ర్భాన్ని ఎప్పటికీ మ‌రిచిపోలేన‌ని యువ వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ పేర్కొన్నాడు. ద్రవిడ్‌ అలా అనగానే.. నా య‌ద‌లో వేయి వీణ‌లు మోగిన‌ట్లు అనిపించిందని తెలిపాడు. దిగ్గజ క్రికెటర్‌ ద్రవిడ్‌ జట్టులో ఆడతావా అని అడిగినప్పుడు కల నిజమైన అనుభూతి కలిగిందని శాంసన్‌ తెలిపాడు. వీరిద్దరూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కలిసి ఆడారు.

నా జ‌ట్టులో ఆడుతావా:

నా జ‌ట్టులో ఆడుతావా:

తాజాగా కేరళ కీపర్ సంజూ శాంస‌న్ మాట్లాడుతూ... '2013 ఐపీఎల్ ట్ర‌య‌ల్స్ జరుగుతున్నాయి. రాహుల్‌ భాయ్‌, జుబిన్‌ భారుచ (ప్రాంఛైజీ చీఫ్‌) రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రయల్స్‌ నిర్వహించారు. అప్పుడు నేను మంచి ఇన్నింగ్స్‌ ఆడాను. రెండో రోజు ముగిశాక.. రాహుల్‌ భాయ్‌ నా వద్దకొచ్చాడు. నా జట్టులో ఆడతావా అని అడిగాడు. నా య‌ద‌లో వేయి వీణ‌లు మోగిన‌ట్లు అనిపించింది. క‌ల నిజ‌మైన భావ‌న‌తో వెంట‌నే ఒప్పుకున్నా' అని తెలిపాడు.

ద్ర‌విడ్ లాంటి వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు:

ద్ర‌విడ్ లాంటి వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు:

'ప్ర‌పంచ క్రికెట్‌లో ద్ర‌విడ్ లాంటి వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు. ఎలాంటి సమ‌స్య చెప్పిన దానికి ప‌రిష్కార మార్గం చూప‌గ‌ల మార్గ‌నిర్దేశ‌కుడు ఆయ‌న‌. ఏ స‌మ‌యంలోనైనా ఎలాంటి స‌మ‌స్య గురించి వివ‌రించినా.. విసుగు లేకుండా బ‌దులిస్తాడు. ప్ర‌తిఒక్క‌రికీ అందుబాటులో ఉండే విష‌యంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. ఇక అంత‌ర్జాతీయ స్టార్లు బెన్ స్టోక్స్‌, జోస్ బ‌ట్ల‌ర్‌, స్టీవ్ స్మిత్ మ్యాచ్‌కు ముందు ఎలా సిద్ధ‌మ‌వుతారో ద‌గ్గ‌రనుంచి గ‌మ‌నించే అవ‌కాశం ల‌భించింది' అని శాంస‌న్ పేర్కొన్నాడు.

మళ్లీ ఎంపికవ్వడం గొప్పగా అనిపించింది:

మళ్లీ ఎంపికవ్వడం గొప్పగా అనిపించింది:

టీమిండియాకు మళ్లీ ఎంపికవ్వడం గొప్పగా అనిపించిందని సంజు శాంసన్‌ వెల్లడించాడు. విరాట్‌ భాయ్‌, రోహిత్‌ భాయ్ ‌లాంటి ఆటగాళ్ల మధ్య ఉండటం అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ మ్యాచుల్లో తనపై విశ్వాసంతో సూపర్‌ ఓవర్లో పంపించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. తననో మ్యాచ్‌ విజేతగా వారు భావించారని వెల్లడించాడు.

Story first published: Wednesday, May 6, 2020, 15:16 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+