Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీతో వచ్చే అసలు సమస్య అదే - గంభీర్

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని గంభీర్ కొనియాడాడు. అలాగే ధోనీకి అసాధారణమైన బ్యాటింగ్, నాయకత్వ నైపుణ్యాలు సొంతమని అన్నాడు. ఆఖరి వరకు ఓటమిని అంగీకరించని ధోనీ వైఖరి ప్రత్యర్థి జట్లకు ప్రధాన సమస్య అని గంభీర్ తెలిపాడు.

''నేను విజయం కోసం పోరాడతాను. మైండ్‌లో ఇది చాలా క్లియర్‌గా ఉంటుంది. స్నేహితులు, గౌరవం ఇవ్వడం.. వంటి విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత నేను కేకేఆర్ కెప్టెన్, ధోనీ సీఎస్కే కెప్టెన్ అంతే! విజయమే ప్రధాన లక్ష్యం. ఈ విషయాన్ని ధోనీని అడిగిండి. తను కూడా ఇదే సమాధానం చెప్తాడు. గెలుపు వాళ్ల గురి అంటాడు. అయితే భారత్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతనిని ఎవరూ అందుకోలేరు. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు''

When Playing Against MS Dhoni Victory Isn t Assured Until the Last Ball- Gautam Gambhir

''విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైన పరిస్థితిలోనూ ధోనీ క్రీజులో ఉంటే జట్టును గెలిపిస్తాడు. అదే సమయంలో సీఎస్కేకు సవాలు విసిరే బౌలింగ్‌ను ప్రయోగించాలని నేను ఆలోచిస్తాను. ధోనీ కంటే మెరుగైన వ్యూహాలు అమలుచేయడానికి ప్రయత్నిస్తాను. మైదానంలో అతను దూకుడుగా ఉండడు. కానీ అతని గురించి నాకు తెలుసు. ఓటమిని అస్సలు అంగీకరించడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా అలానే ఉంటుంది. సీఎస్కేతో ఆఖరి బంతి ముగిసేవరకు గెలుస్తామనే ధీమాతో ఏ ప్రత్యర్థి జట్టు ఉండదు'' అని గంభీర్ పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించిన విషయం తెలిసిందే. కాగా, గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు వహించిన గంభీర్ ఈ సీజన్‌లో కోల్‌కతా గూటికి చేరాడు. గంభీర్ రాకతో సునిల్ నరైన్, రసెల్ తిరిగి తమ లయను అందుకోవడం విశేషం. ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ధోనీ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు.

Story first published: Monday, April 8, 2024, 15:26 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+