అర్ధరాత్రి లాహోర్ వీధుల్లో గంగూలీ: ముషారఫ్ నుంచి హెచ్చరికతో ఫోన్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పాకిస్థాన్‌లో వింత అనుభవం ఎదురైంది. 2004లో ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించిన జట్టు కెప్టెన్ అయిన దాదాని అప్పటి దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సుతిమెత్తగా మందిలించిన సందర్భం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే 2004లో పాకిస్థాన్ పర్యటనకు టీమిండియా వెళ్లింది. సిరిస్‌లో భాగంగా టీమిండియాకు లాహోర్‌లోని స్విష్ పెరల్ కాంటినెంటల్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. జట్టుకు పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే 3-2తో సిరిస్ నెగ్గిన ఆనందాన్ని ఆస్వాదించేందుకు భారత కెప్టెన్ గంగూలీ అర్ధరాత్రి లాహోర్ వీధుల్లోకి వెళ్లొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ గంగూలీకి ఫోన్ చేసి ఎంతో మర్యాదగా దాదాను పలుకరించాడు. అనంతరం ఓ సున్నితమైన హెచ్చరిక కూడా చేశాడు. పాకిస్థాన్‌లో అర్ధరాత్రివేళ వీధుల్లో తిరిగే సాహసం చేయొద్దని, దానికంటే వసీం అక్రమ్ భయంకరమైన ఇన్-కట్టర్లను ఎదుర్కోవడం సులభమని చెప్పారు.
బయటికి వెళ్లాలనుకుంటే చెప్పండి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని, అంతేగాని అర్ధరాత్రి సాహాసాలు చేయద్దని అన్నాడు. ఈ విషయాన్ని త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ 'ఎ సెంచరీ ఇజ్ నాట్ ఎన్‌ఫ్'లో గంగూలీ వివరించాడు. దీంతో పాటు గ్రెగ్ ఛాపెల్ వల్ల తనకు ఎదురైన ఇబ్బందులను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు.
భారత క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం అనంతరం జట్టు నాయకత్వ పగ్గాలను అందుకున్న గంగూలీ... సహచర ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాలందించడంలో కీలకమయ్యాడు. ఎవరి మాట వినిపించుకోకుండా అతన్ని కోచ్‌గా చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని ఆత్మకథలో చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications