Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకొక రూల్.. పంత్‌కొక రూల్..! ఇదేమైనా బాగుందా, మీరే చెప్పండి

When pant is fined more.. why ms dhoni is less fined?

నిన్నటి రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే నోబాల్ వివాదం, అంపైర్ డిసిషన్, పంత్ బిహేవియర్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. చివరి ఓవర్ మూడో బంతికి మెక్‌కాయ్ వేసిన హై ఫుల్ టాస్‌ను అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడంతో రచ్చ రంభోలా జరిగింది. కెప్టెన్ పంత్.. ఇక ఆట ఆపేసి వచ్చేయాలంటూ బ్యాటింగ్ చేస్తున్న తన టీం మేట్స్‌ను రమ్మనగా.. అసిస్టెంట్ కోచ్ ఆమ్రే స్టేడియంలోకి పరిగెత్తి అంపైర్‌తో వాదించాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం ఫైన్ విధించింది.

అలాగే శార్దూల్ ఠాకూర్, ఆమ్రే కూడా పనిష్‌మెంట్‌కు గురయ్యారు. ఈ క్రమంలో 2019లో జరిగిన ఇలాంటి ఘటనపై నెటిజన్లు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. 2019లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఇలాంటి సిచువేషన్ ఒకటి చోటుచేసుకుంది. అప్పుడు చెన్నై కెప్టెన్, మిస్టర్ కూల్ అయిన ఎంఎస్ ధోనీ ఆవేశంతో హాట్‌హాట్ అయిపోయాడు. అంపైర్ డిసిషన్ మీద మండిపడుతూ.. స్టేడియంలోకి వచ్చి అంపైర్లతో గొడవకు దిగాడు.

ఆ మ్యాచ్‌లో కూడా సేమ్ నోబాల్ వివాదమే నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బెన్ స్టోక్స్ కీలక ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో స్టోక్స్ హై ఫుల్ టాస్‌ వేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్లు లీగల్ డెలివరీగా ప్రకటించారు. అప్పుడు మ్యాచ్ మంచి రసవత్తర స్థితిలో ఉంది. ప్రతి బాల్ కీలకంగా మారిన దశలో ఇది జరగడంతో చెన్నై కెప్టెన్ ధోనీ అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు.

డగౌట్ నుంచి ఆవేశంగా గ్రౌండ్‌లోకి వచ్చాడు. అంపైర్లతో గొడవపడ్డాడు. అయినప్పటికీ అంపైర్లు తన నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. ఇక ఎలాగోలా చివరికి సీఎస్కే నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అప్పట్లో ధోనీ ఇలా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి ఎంటర్ కావడం చర్చనీయాంశమైంది. తాజాగా ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరగింది.

అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో అంపైర్ల నిర్ణయాన్ని పట్టించుకోకుండా ధోనీ గ్రౌండ్లోకి దూసుకొచ్చి వాదించినా అప్పుడు ధోనీకి ధోనికి 50శాతం ఫైన్ పడింది. కానీ ప్రస్తుతం ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు మాత్రం మ్యాచ్ ఫీజులో వంద శాతం ఫైన్ పడింది. దీనిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్ యాజమాన్యం పక్షపాతంతో వ్యవహరిస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ధోనీ అంటే పవర్ ఫుల్ పర్సన్ కాబట్టి.. అతను నిబంధనలు ఉల్లంఘించినా నడుస్తుంది.. అంపైర్ తప్పుడు నిర్ణయంపై పంత్‌ నిరసన తెలిపితే మాత్రం నడవదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ధోనీకో రూల్ పంత్‌కో రూల్ అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం కొత్త చిక్కులు ఎదుర్కొంటుంది.

Story first published: Saturday, April 23, 2022, 14:05 [IST]
Other articles published on Apr 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+