'బస్సు డ్రైవర్‌గా ధోనీనే హోటల్‌కు తీసుకెళ్లాడు'


హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో భారత్ తరపున ఆడిన క్రికెటర్లలో ముఖ్యుడుగా పేరుగాంచాడు. ఇటీవలే విడుదల చేసిన ఆత్మకథలో అప్పటి క్రికెటర్లతో తనకు మధ్య జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మహేంద్రసింగ్ ధోని స్వయంగా టీమ్ బస్సు నడిపి ఆటగాళ్లను గ్రౌండ్ నుంచి హోటల్‌కి తీసుకెళ్లినట్లు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా బహిర్గతం చేశాడు.

ధోనీతో నాకు మధుర జ్ఞాపకాలు
‘మహేంద్రసింగ్ ధోనీతో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. అందులో ముఖ్యంగా.. చెప్పాలంటే నా 100వ టెస్టు మ్యాచ్ ఆడిన రోజు.. నాగ్‌పూర్ గ్రౌండ్ నుంచి ధోనీ స్వయంగా బస్సు నడుపుతూ జట్టుని హోటల్‌కి తీసుకెళ్లాడు. అనిల్ కుంబ్లే నుంచి టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ అలా బస్సు నడపడాన్ని నేను మొదట నమ్మలేకపోయా.' అని వీవీఎస్ లక్ష్మణ్ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు.

ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు..
ధోనీ ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు.. అతనిలా ఉండేవారిని నేను ఇంత వరకూ చూడలేదు' ఆయన ఆత్మకథ ‘281 అండ్ బియాండ్' పుస్తకంలో మహేంద్రసింగ్ ధోనీ వ్యక్తిత్వం గురించి ఈ మాజీ క్రికెటర్ సుదీర్ఘంగా ప్రస్తావించాడు. 2008నవంబరులో ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌తో అనిల్ కుంబ్లే కెప్టెన్‌గా టెస్టులకి వీడ్కోలు పలికాడు.

జట్టు పగ్గాలను అందుకుని ముందుకు నడిపి
ఆ సమయంలో ధోనీ జట్టు పగ్గాలను అందుకుని ముందుకు నడిపిన విషయం తెలిసిందే. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు. 2017 జనవరిలో మిగిలిన ఫార్మాట్లు వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సైతం వైదొలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications