Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై జట్టులో మరో హిట్టర్.. ఇక ప్రతి బంతీ సిక్సరే!!

When MS Dhoni pulled Piyush Chawlas legs during CSKs training session

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లీగ్‌లో విజయవంతమైన జట్టు ఏదంటే.. చెన్నై పేరునే చెబుతారు అందరు. చెన్నై విజయాలకు కారణం ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ. జట్టు సభ్యుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంలో ధోనీ సిద్ధహస్తుడు. మ్యాచ్ జరుగుతున్నపుడు ఎవరిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కి పంపాలి అనే దానిపై ధోనీ ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అయితే ఇప్పటికే హిట్టర్లతో నిండిన చెన్నై జట్టులో మరో హిట్టర్‌ని రెడీ చేస్తున్నాడట మహీ. విషయంలోకి వెళితే...

చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్:

షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభంకావాల్సి ఉండే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని మొదటగా ఏప్రిల్ 15కు వాయిదా వేసిన బీసీసీఐ.. ఆపై లాక్‌డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ఐపీఎల్ వాయిదాకి ముందు మార్చి మొదటి వారంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, పీయూష్ చావ్లా, అంబటి రాయుడు, మురళీ విజయ్ తదితరులు కోసం ప్రాక్టీస్ చేశారు. రెండు వారల పాటు సాగిన ఈ ప్రాక్టీస్‌లో అందరూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసారు.

పీయూష్ చావ్లాకి ఓ టాస్క్:

పీయూష్ చావ్లాకి ఓ టాస్క్:

ప్రాక్టీస్ సమయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. పీయూష్ చావ్లాకి ఓ టాస్క్ ఇచ్చాడు. 'బంతిని డిఫెన్స్ చేయడానికి నీకు అనుమతి లేదు. ప్రతి బంతినీ స్టేడియం బయటికి కొట్టాలి' అని చావ్లాతో ధోనీ చెప్పాడు. ఆ పక్కనే రైనా కూడా ఉన్నాడు. 'నీలా బంతిని కొట్టలేను మహీ.. కానీ ట్రై చేస్తా' అని చావ్లా అన్నాడు. కొన్ని బంతుల తర్వాత చావ్లా బంతిని బలంగా బాదుతాడు. నెట్స్‌లో చావ్లా హిట్టింగ్ చేసిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తాజాగా అభిమానులతో పంచుకుంది.

ఇక ప్రతి బంతీ సిక్సరే:

ఇక ప్రతి బంతీ సిక్సరే:

చావ్లా హిట్టింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన చెన్నై అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'చెన్నై జట్టులోకి మరో హిట్టర్ వచ్చాడు.. ఇక ప్రతి బంతీ సిక్సరే' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'మరో హిట్టర్‌ని రెడీ చేస్తున్నాడు మహీ' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం వేలంలో రూ. 6.75 కోట్లతో చావ్లాని చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో సునీల్ నరైన్ భారీ హిట్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే:

టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే:

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. దీంతో టోర్నీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే అక్టోబరు-నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.

Story first published: Tuesday, June 2, 2020, 19:23 [IST]
Other articles published on Jun 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+