
ఆలోచనలో పడ్డా ధోనీ
2006లో వెస్టిండీస్ వేదికగా ఎంఎస్ ధోనీ అద్భుతంగా ఆడాడు. అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయాలనుకున్నా.. స్కోరు తక్కువగా ఉండటంతో కొంచెం ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా ఇదే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన ధోనీ (69: 52 బంతుల్లో 4x4, 6x6) చూస్తుండగానే తనదైన శైలిలో చెలరేగి స్కోరు బోర్డుని అమాంతం పెంచేశాడు. 419/5తో ఉన్నస్కోరును 521/6 కి తెచ్చాడు. దీంతో కెప్టెన్ ద్రవిడ్ ధీమాగా ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసాడు.

హ్యాట్రిక్ సిక్సర్లు
2005లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. సంవత్సరం తిరిగేసరికి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కరేబియన్ గడ్డపై ఎడమచేతి వాటం చైనామన్ స్పిన్నర్ దేవ్ మహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. తన 'హెలికాప్టర్ షాట్స్'తో వరుసగా 6, 6, 6 బాదాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో.. మ్యాచ్ చేజారుతుందేమో అని కెప్టెన్ బ్రయాన్ లారా ఒక్కసారిగా బయపడిపోయాడు. ఈ క్రమంలో బౌలర్లను మార్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ధోనీ 6 సిక్సర్లు, 4 ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది.

చివరికి టెస్టు డ్రా
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 371 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వసీమ్ జాఫర్ (212) డబుల్ సెంచరీ బాదడంతో మొరుగైన స్కోరు చేసేలా కనిపించిన భారత్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో ధోనీ మాయాజాలం చేసాడు. చివరికి భారత్ 521/6తో డిక్లేర్ చేసింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. మ్యాచ్‌లో ఆఖరి రోజు ముగిసే సమయానికి 298/9తో నిలవడంతో ఆ టెస్టు డ్రాగా ముగింసింది.

ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్:
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.


Click it and Unblock the Notifications












