Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెప్పింది చెయ్.. పిచ్చోడిననుకున్నవా: ధోనీ

When MS Dhoni got angry at Kuldeep Yadav, I have played 300 matches, do you think I am mad?

హైదరాబాద్: కెప్టెన్ కూల్ ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా కనిపించే ధోనీ.. కోపం తెచ్చుకున్నాడట. వికెట్ల వెనుక ఉండి ఫీల్డింగ్‌ను.. బౌలింగ్‌ను సెట్ చేసే ధోనీకి కుల్దీప్ ఎదురుచెప్పాడట. గత ఏడాది చివర్లో శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదట భారత్‌ 260 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత లంక బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు.

స్పిన్నర్లనూ లెక్క చేయలేదు. ఆ స్థితిలో కుల్‌దీప్‌కు ఫీల్డింగ్‌ మార్చమని సలహా ఇచ్చాడట ధోని. కవర్స్‌లో ఉన్న ఫీల్డర్‌ను తీసేసి పాయింట్‌లోకి తెమ్మని ధోని చెప్పగా.. కుల్‌దీప్‌ అవసరం లేదన్నాడట. దీంతో మహి.. ''300 మ్యాచ్‌లాడిన నేను పిచ్చోడిననుకున్నావా'' అంటూ ఆగ్రహించాడట. దీంతో కుల్‌దీప్‌ సరే అని ఫీల్డర్‌ను మార్చాడట.

వెంటనే వికెట్‌ పడిందని.. అప్పటికి కానీ ధోని అనుభవమేంటో తనకు అర్థం కాలేదని కుల్‌దీప్‌ వెల్లడించాడు. తర్వాత ధోని తన దగ్గరికి వచ్చి 'ఇదే నేను చెప్పింది' అన్నట్లు కుల్‌దీప్‌ తెలిపాడు. కొద్ది రోజుల ముందు ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో కీలకంగా మారాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధోనీ.. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు చెప్పిన మాటను జట్టులో ఎవ్వరూ ఎదిరించలేదని తెలిపాడు. కామన్‌సెన్స్‌తో వ్యవహరించాలని ప్రతి ఒక్కరి భావాలకు విలువనివ్వాలని ఆ సందర్భంగా ధోనీ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:33 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+