|
ఆటో నడుపుకోవాలన్నారు..
అసలు ఈ పర్యటనలోనే ఓ కొత్త సిరాజ్‌ను తలపించాడు. ఈ క్రమంలోనే డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా మాట్లాడాడు. సోనీ టీవీ ఇది ఎపిసోడ్స్‌లా ప్రసారం అవుతుంది. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్లో సిరాజ్ తన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవ్వడం కనిపించింది.
'2018లో సోషల్ మీడియా వేదికగా నేను తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. కొందరైతే క్రికెట్‌ను వదిలేసి మా నాన్నగారిలా ఆటో నడుపుకోవాలని ఘాటుగా విమర్శించారు. ఆ క్షణమే టీమిండియా తరఫున విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ కల గబ్బా వేదికగా నేరవేరింది.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

అనవసర హైప్ అంటూ..
2017లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. ఆరంభంలో దారుణంగా విఫలమయ్యాడు. 2018 ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ తరఫున స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ధారళంగా పరుగలిస్తూ జట్టుకు భారంగా మారాడు.
దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు సిరాజ్ ఏ మాత్రం పనికి రాడని, ఆటో డ్రైవర్ కొడుకని, అతనికి అనవసర హైప్ ఇచ్చారని కామెంట్ చేశారు. స్థాయికి మించిన స్థానం లభించిందని అందుకే విఫలమవుతున్నాడని మండిపడ్డారు.
|
తండ్రి మరణం..
అయితే ఈ విమర్శలకు సిరాజ్ తన ఆటతోనే బదులిచ్చాడు. 2020 ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్.. 8.68 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ పెర్ఫామన్స్తోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు. అయితే అతను ఆసీస్ గడ్డపై అడుగుపెట్టగానే ఆనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మరణించాడు.
కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో తండ్రి కడచూపునకు కూడా నోచుకోలేదు. ఈ బాధను అంతా కసిగా మార్చుకున్నాడు. గబ్బా వేదికగా సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన సిరాజ్.. ఐదు వికెట్ల ఘనతతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. సిరాజ్ పెర్ఫామెన్స్‌కు ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో టీమిండియా సిరీస్ విజయాన్నందుకుంది.

మా విజయాన్ని మళ్లీ చూడండి..
ఈ పర్యటన తర్వాత సిరాజ్ మరింత మెరుగయ్యాడు. టీమిండియా ప్రధాన పేసర్‌గా స్థిరపడిపోయాడు. ఇక ఈ సిరీస్‌కు సంబంధించిన డాక్యుమెంటరీ DownUnderdogs ఫైనల్ ఎపిసోడ్ అప్డేట్ను సిరాజ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. చారిత్రాత్మక విజయాన్ని మరోసారి చూడండని సోనీ టీవీకి సంబంధించిన ప్రోమోను షేర్ చేశాడు. మరో ట్వీట్లో టీమిండియాకు ఆడటం ద్వారా తన కల నిజమయితే.. ఏ మాత్రం ఊహించని సిరీస్ విజయం దక్కిందన్నాడు.