Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్ర‌భుత్వ ఉద్యోగ లెటర్ చించేసి.. స‌య్య‌ద్ అలీ ట్రయల్స్‌కు వెళ్లిన స్టార్ క్రికెటర్!!

When Krunal Pandya tore up government job offer letter, That moment changed my life

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ క్రునాల్ పాండ్యా ఒకానొక దశలో క్రికెట్ వదిలేసే పరిస్థితి వచ్చిందట. ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరమని వాళ్ల నాన్న చెప్పాడట, అయితే ఆ ప్ర‌భుత్వ ఉద్యోగ లెటర్ చింపడంతోనే తన కెరీర్ మలుపు తిరిగిందని క్రునాల్ చెప్పాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం చివరిసారిగా ట్రయల్స్ వెయ్యడం కోసమే ఆ లెటర్ చింపినట్టు ఈ బరోడా క్రికెటర్ తెలిపాడు. అయితే తాను వెలుగులోకి రావ‌డానికి కార‌ణం మాత్రం భార‌త మాజీ చీఫ్ కోచ్ జాన్ రైట్ అని చెప్పుకొచ్చాడు.

ప్ర‌భుత్వ ఉద్యోగ లెటర్:

ప్ర‌భుత్వ ఉద్యోగ లెటర్:

తాజాగా క్రునాల్ పాండ్యా స్పైసీ పిచ్ ఎపిసోడ్లో మాట్లాడుతూ... 'నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ రోజు ప్ర‌భుత్వంలో ఒక స్పీడ్ పోస్ట్ జాబ్ కోసం నాకు ఓ ఉత్త‌రం వ‌చ్చింది. ఇది మంచి అవ‌కాశం అని నాన్న కూడా చెప్పారు. నెల‌కు రూ.20-25 వేలు సంపాదించ‌చ్చు, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్నారు. అదే సమయంలో సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నీ కోసం ట్రయల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఉద్యోగమా, క్రికెటా అని కొంత గందరగోళానికి గురయ్యా' అని తెలిపాడు.

ఉత్త‌రాన్ని చింపేసి ట్రయల్స్‌కు:

ఉత్త‌రాన్ని చింపేసి ట్రయల్స్‌కు:

'అప్పుడ‌నుకున్నాను.. గ‌త కొన్నేళ్ల నుంచి క్రికెట్ కోసం చాలా క‌ష్డ‌ప‌డుతున్నాను. కొత్త ప్లేయ‌ర్‌గా నిరూంపిచుకునేందుకు మంచి అవ‌కాశం ల‌భిస్తుంద‌నుకున్నా. ఆ ఉత్త‌రాన్ని చింపేసి బ‌రోడా త‌ర‌ఫున ట్ర‌య‌ల్స్ హాజ‌రయ్యాను. ఆ టోర్నీలో మంచి ప్రదర్శన చేశాను. దీంతో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు బరోడా జట్టులో చోటు దక్కింది. అప్ప‌టికే హార్దిక్‌ పాండ్యా టీమ్‌లో ఉన్నాడు. యాదృచ్చికంగా ముంబైలో జ‌రిగిన టోర్నీలో జాన్ రైట్.. నాతో పాటు హార్దిక్ ఆటను దగ్గరుండి చూసారు' అని క్రునాల్ పేర్కొన్నాడు.

అదే టర్నింగ్ పాయింట్:

అదే టర్నింగ్ పాయింట్:

'మా ఇద్దరి ఆట‌తీరును గమనించిన అప్పటి ముంబై ఇండియ‌న్స్ కోచ్ జాన్ రైట్.. జట్టులో చోటు క‌ల్పించారు. అలా ముంబైకి ఎంపికయ్యాం. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ వెనుదిరిగి చూడ‌లేదు. ఆ తర్వాత జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాం. నాన్న, అమ్మ అందరం హ్యాపీ. ఒక వేళ నేను ట్ర‌య‌ల్స్‌కు హాజ‌రు కాకుండా ఉద్యోగం వైపు వెళ్లుంటే.. మా జీవితాలు ఇలా ఉండేవి కావు. ఆ లెటర్ చింపడమే నాకు టర్నింగ్ పాయింట్' అని క్రునాల్ చెప్పుకొచ్చాడు.

భారత్ తరఫున 18 టీ20లు:

భారత్ తరఫున 18 టీ20లు:

క్రునాల్ పాండ్యా 2018లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 18 టీ20లు ఆడి 121 పరుగులు, 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌ 55 మ్యాచులు ఆడి 891 పరుగులు, 40 వికెట్లు తీసాడు. తాజాగా పాండ్యా బ్రదర్స్ ఇంట్లోనే క్రికెట్ ఆడుతూ.. ఈ క్వారంటైన్ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియురాలు నటాషా స్టాంకోవిచ్, సోదరుడు కృనాల్ పాండ్యా, వదినతో క్వారంటైన్‌ను తెగ ఎంజయ్ చేస్తున్న హార్దిక్.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నాడు.

Story first published: Saturday, April 11, 2020, 20:18 [IST]
Other articles published on Apr 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+