Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉద్వేగానికి లోనయ్యారు: కోచ్‌కు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన కోహ్లీ

న్యూఢిల్లీ: విద్యాబుద్ధులు నేర్పిన గురువులనే కాదు, ఆటలో కూడా తమకు మెళకులు నేర్పిన గురువులను శిష్యులు పూజిస్తుంటారు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మించిన వారు లేరు. తనకు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు ఆచ్రేకర్ పట్ల సచిన్ ఎప్పడూ విధేయతను ప్రదర్శిస్తుంటారు.

తాజాగా ఈ కోవలోకి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాడు. తన గురువు రాజ్ కుమార్ శర్మకు కోహ్లీ టీచర్స్ డే రోజున ఆశ్చర్యాన్ని కలిగించేలా వ్యవహరించాడు. గురువుకు స్కోడా కారుని టీచర్స్ డే రోజున బహుమతిగా అందజేశాడు. ఈ సంఘటన 2014లో టీచర్స్ డే రోజున జరిగింది.

కోహ్లీ నుంచి కారుని బహుమతిగా అందుకున్న రాజ్ కుమార్ శర్మ ఈ సంఘటన తన జీవితంలో మరిచపోలేని సంఘటనగా అభివర్ణించాడు. టీచర్స్ డే రోజున ఏం జరిగిందో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి తాను కొత్తగా రచించిన 'డ్రైవిన్' అనే పుస్తకంలో రాశాడు.

When Kohli gifted his coach a Skoda Rapid car

టీచర్స్ డే రోజున తన ఇంటి బయట కాలింగ్ బెల్‌ మోగగానే తలుపు తీయడంతో బయట కోహ్లీ అన్నయ్య (వికాస్) ఉన్నాడని రాజ్ కుమార్ చెప్పినట్లు విజయ్ తన పుస్తకంలో రాశాడు. 'కోహ్లీ అన్నయ్యని చూసి లోపలికి రమ్మని ఆహ్వానించాను. లోపలికి వచ్చిన వికాస్ ఓ నెంబర్‌కు ఫోన్ చేసి రాజ్ కుమార్‌ని మాట్లాడమని ఫోన్ ఇచ్చాడు. అవతలి వైపు నుంచి 'హ్యాపీ టీచర్స్ డే సర్' అనే గొంతు వినిపించింది. ఆ గొంతు కోహ్లీది. వెంటనే విరాట్ ఏదో చెప్పగా వికాస్ తన చేతిలోని పువ్వులతో పాటు తాళాలను చేతిలో పెట్టాడు' అని వివరించాడు.

'వెంటనే రాజ్ కుమార్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే తన ఇంటి ముందు స్కోడా రాపిడ్ కారు పార్క్ చేసి ఉంది. టీచర్స్ డే రోజున కోహ్లీ తన గురువుకి బహుమితి'ని ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్ కుమార్ ఒకానొక కార్యక్రమంలో వెల్లడించాడు.

కోహ్లీ నుంచి కారుని బహుమతిగా అందుకున్న రాజ్ కుమార్ కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు. తన పట్ల కోహ్లీకి ఉన్న ఉద్విగ్నితను తెలియజేస్తుందని ఆయన తెలిపాడు. జీవితంలో గురువుకి ఉన్న విలువని కోహ్లీ గుర్తు చేశాడని రాజ్ కుమార్ ఎంతో సంతోషించారు.

కోహ్లీ ముద్దు పేరు 'చీకూ'
కోహ్లీని సహచర ఆటగాళ్లు ముద్దుగా 'చీకూ' అని పిలుస్తుంటారు. ఈ విషయాన్ని టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన పుస్తకం 'టెస్ట్ ఆఫ్ మై లైఫ్' లో వెల్లడించిన సంగతి తెలిసిందే. 'చంపాక్' అనే కామిక్ సిరిస్‌లో కోహ్లీ ముద్దు పేరు 'చీకూ' బాగా ఫేమస్ అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+