ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్‌ని గిరాటేసిన జడేజా (వీడియో)


హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో కళ్లు చెదిరే రనౌట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్ కలిసి చక్కదిద్దుతున్నారు.
ఉస్మాన్ ఖవాజా 19వ ఓవర్లో రనౌట్ కావడంతో వీరిద్దరి 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని ఖవాజా పాయింట్ దిశగా ఆడాడు. సింగిల్ కోసం ప్రయత్నించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని స్టంప్స్ వైపు విసిరాడు.
ఉస్మాన్ ఖవాజా రనౌట్
ఆ బంతి నేరుగా వచ్చి వికెట్లను గిరాటేసింది. అప్పటికి ఖవాజా క్రీజుకు అడుగు దూరంలో నిలిచిపోవడంతో రనౌట్ రూపంలో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఉస్మాన్ ఖవాజాను జడేజా రనౌట్ చేసిన వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

చివరి ఓవర్ వరకు ఉత్కంఠ
చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్ టచ్‌తో విజయం భారత్‌నే వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు.

భారత్ విజయ లక్ష్యం 299
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131) సెంచరీ, మాక్స్‌వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు.

1-1తో సిరిస్ సమం
వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే మెల్‌బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications