జుట్టు మాత్రం కత్తిరించుకోను: కోచ్‌తో తేల్చి చెప్పిన ఇషాంత్ శర్మ
హైదరాబాద్: తన పొడవాటి జుట్టు కారణంగా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సరదా సన్నివేశాలను టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్యూలో అభిమానులతో పంచుకున్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇషాంత్ శర్మ టెస్టు అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఇషాంత్ శర్మ ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌లో అభిమానులకు కనిపిస్తూనే ఉన్నాడు. నిజానికి ఇషాంత్ శర్మకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడమంటే ఎంతో ఇష్టమట. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ ఓసారి తన పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఆగ్రహానికి కూడా గురయ్యాడట.
'ఆ సమయంలో నేను అండర్-19 క్రికెట్ జట్టులో ఆడుతున్నాను. ఓ సారి పాఠశాల అసెంబ్లీ జరుగుతోంది. అందరం హాజరయ్యాం. సరిగ్గా అప్పుడే మా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వచ్చి పొడవాటి జట్టు ఉన్నవాళ్లను ముందుకు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. సైలెంట్‌గా నిల్చున్నాను' అని చెప్పాడు.

జట్టును పట్టుకుని అసెంబ్లీ నుంచి బయటికి లాక్కొచ్చాడు
'అయితే అందరి కంటే ఎత్తుగా ఉండటం వలన వైస్ ప్రిన్సిపల్ కంట పడ్డాను. ఇంకేముంది అతను రమ్మంటే రాలేదని ఆగ్రహంతో నా జట్టును పట్టుకుని అసెంబ్లీ నుంచి బయటికి లాక్కొచ్చాడు. అయినప్పటికీ నేను నా జట్టును కత్తిరించుకోలేదు' అని ఇషాంత్ పేర్కొన్నాడు.

అండర్-19 జట్టుకు ఆడే రోజుల్లో మరోసారి
ఢిల్లీ తరుపున అండర్-19 జట్టుకు ఆడే రోజుల్లో మరోసారి ఇషాంత్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ‘అండర్-19 భారత క్రికెట్ జట్టులో ఆడే సమయంలో అప్పటి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో లాల్‌చంద్ సార్ నా దగ్గరికి వచ్చి ఇషాంత్ నీ ఫ్యాషన్‌కు ఇక్కడితో స్వస్తి పలుకు' అని అన్నాడు.

నువ్వు ఏమీ మోడల్ కాదు
'ఇక్కడ నువ్వు ఏమీ మోడల్ కాదు. జట్టును కత్తిరించు. లేకపోతే 100 డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఫైన్ కట్టేందుకు డబ్బులు తీసుకుని వెళ్లా అంతేకానీ నా జట్టు మాత్రం కత్తిరించలేదు' అని ఇషాంత్ తెలిపాడు.

77 టెస్టు మ్యాచ్‌లాడి 218 వికెట్లు తీసిన ఇషాంత్
భారత్ తరుపున 77 టెస్టు మ్యాచ్‌లాడిన ఇషాంత్ శర్మ 218 వికెట్లు తీశాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇషాంత్ బుధవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో కూడా తన పొడవాటి హెయిర్ స్టయిల్‌తో మరోసారి అభిమానులను అలరించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications