For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ సంబరానికి వేళాయె: తొలి మ్యాచ్‌లో బోణీ ఎవరిదో?

నగరానికి ఐపీఎల్‌ కళ వచ్చేసింది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే స్టార్‌ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: నగరానికి ఐపీఎల్‌ కళ వచ్చేసింది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే స్టార్‌ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరగబోయే ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తొలి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది. ఆరు నిమిషాలపాటు జరిగే ప్రదర్శనలో అమీ స్టేజ్‌ను హీటెక్కించనుంది. బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ తమ్మ తమ్మ, లెట్స్‌ నాచో, కర్‌ గయీ చుల్లా, కాలా చష్మా లాంటి పాటలకు డ్యాన్స్ చేయనుంది.

మంగళవారం ఆమె రిహార్సల్స్‌ కూడా చేసింది. మూడు వందల మంది కళాకారులతో కలిసి అమీ జాక్సన్ సందడి చేయనుంది. రాష్ట్ర సంస్కృతిని తెలిపే నృత్య రూపకాలను ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా, ఓవరాల్‌గా ఉప్పల్‌లో 21 నిమిషాల పాటు ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30కు మొదలై 6.51 గంటలకు ముగుస్తుంది.

గోల్ఫ్‌ కార్ట్‌‌లలో మైదానంలోకి క్రికెట్ లెజెండ్స్

గోల్ఫ్‌ కార్ట్‌‌లలో మైదానంలోకి క్రికెట్ లెజెండ్స్

అమీ ప్రదర్శన తర్వాత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లను బీసీసీఐ సన్మానించనుంది. దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌‌లు గోల్ఫ్‌ కార్ట్‌‌లలో మైదానంలోకి ప్రవేశిస్తారు.

తొలి మ్యాచ్ మొదలయ్యేది అప్పుడే

తొలి మ్యాచ్ మొదలయ్యేది అప్పుడే

ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత కాసేపు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ల వామప్ తర్వాత తొలి మ్యాచ్ మొదలవుతుంది. మంగళవారం వర్షం కురియడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఆటగాళ్లు ఇండోర్‌లో ప్రాక్టీస్‌ చేశారు.

భారీ భద్రత

భారీ భద్రత

ఈ మ్యాచ్‌ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆరంభ మ్యాచ్, మే 21న ఫైనల్ సహా మొత్తం 8మ్యాచ్‌లకు ఉప్పల్ ఆతిథ్యమిస్తుంది. ఈ మ్యాచ్‌ల కోసం 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 700 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటూన్ల ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మొహరించారు. ఇలా మొత్తంగా 1800మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

హైదరాబాద్, బెంగళూరు జట్లు 9సార్లు ముఖాముఖి

హైదరాబాద్, బెంగళూరు జట్లు 9సార్లు ముఖాముఖి

స్టేడియంలో 88 సీసీ కెమెరాలు, చెక్‌పాయింట్లు, బాంబ్ స్కాడ్ బృందాలతో 24 గంటల పహరా కాస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో హైదరాబాద్, బెంగళూరు జట్లు 9సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 5 మ్యాచ్‌లు, బెంగళూరు 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2014 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నమోదైన సగటు స్కోరు 158. అప్పటినుంచి జరిగిన 15 మ్యాచుల్లో 12 సార్లు లక్ష్యఛేదనకు దిగిన జట్టే గెలిచింది. ఓవరాల్‌గా చూస్తే సొంతగడ్డపై హైదరాబాద్ 8మ్యాచ్‌లాడి ఏడింటిలో విజయం సాధించింది.

డేవిడ్ వార్నర్ సాధించిన పరుగులు 716

డేవిడ్ వార్నర్ సాధించిన పరుగులు 716

ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ సాధించిన పరుగులు 716. గత సీజన్‌లో 54 యావరేజితో 324 పరుగులు సాధించి టోర్నీలో రెండో టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌కింగ్స్ మినహా ఇప్పటివరకు ఏ జట్టు వరుసగా రెండుసార్లు (2010, 11)చాంపియన్‌గా నిలిచిన దాఖలాలు లేవు.

హైదరాబాద్‌కు టైటిల్ నిలబెట్టుకునే అద్భుత అవకాశం

హైదరాబాద్‌కు టైటిల్ నిలబెట్టుకునే అద్భుత అవకాశం

కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ నిలబెట్టుకునే అద్భుత అవకాశముంది. మిగతా జట్లలాగా గాయాల బెడద లేకుండా పూర్తిస్థాయి బెంచ్‌తో హైదరాబాద్ బరిలోకి దిగుతున్నది. దీనికి తోడు అత్యుత్తమ బౌలింగ్ విభాగం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు అదనపు బలం.

బెంగళూరు జట్టును వేధిస్తున్న గాయాలు

బెంగళూరు జట్టును వేధిస్తున్న గాయాలు

గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ కెప్టెన్ కోహ్లీ పూర్తిగా తేరుకోలేదు. తొలిమ్యాచ్‌తో పాటు మరికొన్ని మ్యాచ్‌లకు దూరంకానున్న కోహ్లీ.. రెండు వారాల తర్వాతే లీగ్‌లో ఆడే అవకాశముందని బీసీసీఐ పేర్కొంది.

ఓపెనింగ్ మ్యాచ్‌కు ఏబీ దూరం

ఓపెనింగ్ మ్యాచ్‌కు ఏబీ దూరం

మరోవైపు మంచిఫామ్ మీదున్న లోకేశ్ రాహుల్ భుజం గాయంతో లీగ్‌కు దూరం కాగా, సఫారీ సూపర్‌మన్ డివిలియర్స్, వెన్నునొప్పితో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో లీగ్‌కు అతడు దూరమయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+