Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్లో ద్రావిడ్ గది నుంచి శబ్దాలు, ఫిర్యాదు చేసిన గెస్ట్‌లు

బెంగళూరు: మాజీ భారత కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్.. తనకు నిద్ర రాక హోటల్ గదిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి పూట ఆయన గది నుంచి శబ్దాలు వస్తుండటంతో హోటల్లోని మిగతా అతిథులు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రాహుల్ ద్రావిడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నాడు. ద్రావిడ్ ఓ రోజు హోటల్‌లో గది తీసుకుని ఒంటరిగా ఉన్నాడు. ద్రావిడ్‌ రూమ్ నుంచి పెద్దపెద్ద శబ్దాలు వస్తున్నాయని పక్క రూమ్ వాళ్లు హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

Also Read: షాకింగ్ స్టోరీ: ద్రావిడ్‌తోనే ఉండిపోతానని హైదరాబాద్ యువతి బెట్టు

When hotel guests complained about weird noises coming from Rahul Dravid’s room

గది నుంచి శబ్దాలు వస్తున్నాయని, తమ నిద్రకు భంగం కలిగిందని వారు ద్రావిడ్ పైన ఫిర్యాదు చేశారు. ద్రావిడ్ దగ్గరకు వెళ్లి హోటల్ సిబ్బంది శబ్దాల పైన ప్రశ్నించింది. తనకు నిద్రపట్టకపోవడంతో బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తున్నానని, బ్యాట్‌తో ఫ్లోర్‌పై కొట్టడం వల్ల శబ్దం వచ్చి ఉంటుందని ద్రావిడ్ చెప్పాడు.

తన ప్రాక్టీస్ ఇతరులను ఇలా ఇబ్బంది పెడుతుందని అనుకోలేదని ద్రావిడ్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ద్రావిడ్ కెరీర్‌లో చాలానే ఉన్నాయని అతనే స్వయంగా చెబుతున్నాడు. ప్రముఖ క్రికెట్ హ్యూమరిస్ట్ విక్రమ్ సథయేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రావిడ్ ఇలాంటి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+