Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సల్మాన్ ఖాన్ ను టీజ్ చేసిన హర్భజన్,యూవీ - ఆ హీరోయిన్ గురించేనా!!?

క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్.. సినిమాలో బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కెరీర్ లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తాజాగా హర్భజన్, యూవీ కలిసి సల్మాన్ భాయ్ ను టీజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సల్మాన్ కూడా తిరిగి వారికి ఫన్నీ రిప్లై ఇవ్వడం నవ్వులు పూయించింది.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖన్ సినిమాల్లోనే కాకుండా షోస్ కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంటారు. అయితే గతంలో ఓ సందర్భంలో ఓ షోకు హోస్ట్ గా ఉండగా, ఆ కార్యక్రమానికి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. అలా ఈ ముగ్గురు కలిసి తమ సంభాషణలతో నవ్వులు పూయించారు.

When Harbhajan Singh and Yuvraj Singh hilariously teased Salman Khan about Vivek Oberoi in Dus Ka Dum episode

ఈ క్రమంలోనే సల్మాన్ తాను నటించిన ఓ సినిమా షూటింగ్ గురించి గుర్తుచేసుకున్నారు. 'నేను షూటింగ్ లో ఓ షాట్ లో భాగంగా పరిగెడుతున్నాను..' అని ఏదో విషయాన్ని చెప్పబోయారు. అంతలో హర్భజన్ కలుగజేసుకుని 'ఎవరి వెనక పరిగెడుతున్నావ్. వివేక్ ఒబెరాయ్ వెంట పడుతున్నావా?' అంటూ సరదాగా సెటైర్ వేశారు. దీనికి యూవీతో పాటు అక్కడే ఉన్న ఆడియెన్స్ తెగ నవ్వుకున్నారు.

అప్పుడు సల్మాన్ కూడా ఫన్నీగా బదులిచ్చారు. 'వివేక్ ఒబెరాయా. వదిలేయండి ఇక ఆయన్ను. ఆయన్ను ప్రశాంతంగా జీవించనివ్వండి. లేదంటే ఏ కారణం లేకుండా అనవసరంగా .' అని సరదాగా బదులిచ్చారు.

అసలు హర్భజన్ సింగ్ వివేక్ ఒబెరాయ్ పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గతంలో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ వివేక్ ఒబెరాయ్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత సల్మాన్ కూడా ఐశ్వర్యతో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో స్పష్టత లేదు. అందుకే హర్భజన్ సరదాగా అలా అన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇకపోతే యూవీ, హర్భజన సింగ్ విషయానికొస్తే.. వారు క్రికెట్ కు గుడ్ బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. సల్మాన్ ఖాన్ కోలీవుడ్ దర్శకుడు మురగదాస్ తో కలిసి సికందర్ అనే సినిమా చేస్తున్నారు.

Story first published: Thursday, January 9, 2025, 17:44 [IST]
Other articles published on Jan 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+