Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ కాలర్ పట్టుకున్న బ్రావో, ఫ్యాన్స్ దిమ్మ తిరిగింది!

న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో భారత ట్వంటీ 20వ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలర్ పట్టుకున్నాడు. అయితే అది సరదాగా మాత్రమే పట్టుకున్నాడు. గురువారం నాడు భారత్, వెస్టిండీస్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది.

ఈ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు.. మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలర్ పట్టుకున్నాడు.

When Dwayne Bravo grabbed MS Dhoni's collar after losing warm-up match

ధోనీ, డ్వేన్ బ్రావోలు ఐపీఎల్ జట్టు చెన్నైసూపర్ కింగ్స్ (ఈ జట్టు నిషేధానికి గురైంది) ఆటగాళ్లు. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఇందులో భాగంగా ప్రపంచ ట్వంటీ 20 కప్ వార్మప్ మ్యాచ్ అనంతరం బ్రావో.. ధోనీ కాలర్ పట్టుకొన్నాడు. ఇరువురు ఆటగాళ్లు కూడా పరస్పరం కంగ్రాట్స్ చెప్పుకున్నారు.

ఇది తమాషాకేనని చెబుతున్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగింది. బ్రావో.. ధోనీ కాలర్ పట్టుకోవడంపై ఓ క్షణం వీక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, అది తమాషాకేనని వారికి తెలియదని చెప్పవచ్చు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+