Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వస్తే ఒక్కో ఆటగాడు పదివేలు కట్టాలన్న ధోని

MS Dhoni's Unique Punishment For Those Late To Practice || Oneindia Telugu
When Dhonis Rs 10,000 Punishment Ensured No Players Were Late for Meetings and Training

హైదరాబాద్: టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్‌ తన పుస్తకం 'ద బేర్‌ఫుట్‌ కోచ్‌'లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నెట్ ప్రాక్టీస్‌కు, సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో ధోని వినూత్నంగా ఆలోచించేవాడని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తన పుస్తకం 'ద బేర్‌ఫుట్‌ కోచ్‌' విడదల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్యాడీ ఆప్టన్ అప్పటి కెప్టెన్లు అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనిలు వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో కొత్త ఐడియాలతో ఉండేవారని తెలిపాడు. ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్ అయినప్పుడు టెస్టు కెప్టెన్‌గా కుంబ్లే ఉండేవాడు.

ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లకు రూ. 10వేలు జరిమానా

ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లకు రూ. 10వేలు జరిమానా

నెట్ ప్రాక్టీస్‌కు, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లను శిక్షించే నిర్ణయాధికారాన్ని జట్టు మేనేజ్‌మెంట్ అప్పట్లో కెప్టెన్లకు వదిలేసింది. దీంతో ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లకు రూ. 10వేలు జరిమానా విధించాలని టెస్ట్‌ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. అయితే, ధోనీ అందుకు భిన్నంగా ఆలోచించేవాడని తెలిపాడు.

జట్టులోని సభ్యులు ఒక్కొక్కరూ రూ. 10వేలు చెల్లించాలని

జట్టులోని సభ్యులు ఒక్కొక్కరూ రూ. 10వేలు చెల్లించాలని

ఎవరైనా ఆటగాడు నిర్ణీత సమయానికి రాకపోతే జట్టులోని మిగతా సభ్యులు ఒక్కొక్కరూ రూ. 10వేలు చెల్లించాలని ఆదేశించాడు. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్‌కు, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే వాడు కాదని ప్యాడీ ఆప్టన్‌ తన పుస్తకం ‘ద బేర్‌ఫుట్‌ కోచ్‌'లో రాసుకొచ్చాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా

ఆప్టన్‌ ప్రపంచవ్యాప్తంగా పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ల్లోనూ పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆప్టన్‌ మార్గదర్శనంలోనే సిడ్నీ థండర్స్‌ 2016లో బిగ్‌బాష్‌ టైటిల్ విజేతగా నిలిచింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ప్యాడీ ఆప్టన్‌ని రాజస్థాన్ తన హెడ్ కోచ్‌గా నియమించుకుంది.

Story first published: Thursday, May 16, 2019, 12:07 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+