హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. జట్టు నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా ధోని పుట్‌బాల్ ఆడటాన్ని ఎన్నో సార్లు చూశాం. తాజాగా ధోని న్యూజిలాండ్ క్రికెటర్లతో కలిసి పుట్‌బాల్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రాత్రి 9:30 గంటలకు మొదలైన సంగతి తెలిసిందే. మధ్యలో వర్షం తగ్గడంతో భారత ఆటగాళ్లు మైదానంలో కాసేపు పుట్‌బాల్ ఆడారు.

అయితే మూడో టీ20 కోసం ఇరు జట్ల స్టేడియానికి వచ్చిన సమయంలో తిరువనంతపురంలో భారీ వర్షం పడుతుండటంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. డ్రెస్సింగ్ రూమ్‌లోనే పుట్‌బాల్ ఆడారు. మనీష్ పాండేతో కలిసి న్యూజిలాండ్ ప్లేయర్స్ గప్టిల్, టామ్ బ్రూస్‌లతో ధోని వాలీబాల్ ఆడుతూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను మార్టిన్ గుప్తిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే మధ్యలో నెట్ స్థానంలో కుర్చీలు వేసి సాకర్ వాలీబాల్ ఆడారు.