చెన్నై: భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చాలామంది అభిమానులున్నారు. అయితే, అతను మాత్రం ఒకరికి వీరాభిమాని అని ఇటీవలే పేర్కొన్నాడు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ నటి త్రిష అంటే తనకు ఎంతో ఇష్టమని, వారి వీరాభిమానని తెలిపాడు.
ముఖ్యంగా త్రిషకు తాను ఎనిమిదో తరగతి నుంచీ వీరాభిమానిని అని చెబుతున్నాడు అశ్విన్. తమిళంలో త్రిష నటించిన 'లేసా లేసా' సినిమా చూసినప్పట్నుంచీ ఆమెకు అభిమానిగా మారినట్లు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించాడు.

అంతేకాదు, హైస్కూల్‌లో చదివేప్పుడు స్నేహితులతో కలిసి 'త్రిష అభిమాన సంఘం' ఏర్పాటు చేసినట్లూ చెప్పాడు. సంఘాన్ని ఏర్పాటు చేసినా, దాన్ని రిజిస్టర్ చేసుకోవాలన్న విషయం అప్పట్లో తెలియదన్నాడు.
తమిళ సినిమాలంటే తనకిష్టమని తెలిపాడు. ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా హాస్యం పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమాలు చూసి, ఆనందిస్తానని చెప్పాడు.