ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆతిథ్యం తనని ముగ్ధుడిని చేసిందని వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేర్కొన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన నటుడి నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్‌గేల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అమితాబ్ బచ్చన్‌కి క్రిస్‌గేల్ వీరాభిమాని. అమితాబ్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల క్రిస్‌గేల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మేరకు బిగ్ బీ అమితాబ్ తనని ఇంటికి పిలిచి.. విందు ఇచ్చాడని, ఆయన ఆతిథ్యం తనను ముగ్ధుడిని చేసిందని గేల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వెల్లడించాడు.
'మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందకు కృతజ్ఞతలు. చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్ నేను సెంచరీ కొట్టాలి, కానీ ఇండియానే గెలువాలని కోరుకున్నారు. నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా' అని జైమకైన్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా మార్చి 31 (గురువారం)న ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. మరోవైపు క్రిస్‌గేల్‌కు ఇచ్చిన ఆతిథ్యంపై 'అతను నా ఫ్యాన్ అని తెలియదు. ఎంతో హుందాగా నా ఆతిథ్యం స్వీకరించాడు. సెమీ పైనల్ మ్యాచ్‌లో నా కంప్లిమెంట్‌ను అతను స్వీకరిస్తాడే ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశాడు.