For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసిన వేళ హరీశ్ సొహైల్ ఏం చేశాడంటే!

When Australians sledged, I turned a deaf ear: Haris Sohail

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు తనని స్లెడ్జింగ్‌తో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పాక్ బ్యాట్స్‌మెన్ హరీశ్ సొహైల్ ఆరోపించాడు. గత ఆదివారం మొదలైన ఈ టెస్టులో హరీశ్ సోహైల్ (110), హఫీజ్ (126) సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 164.2 ఓవర్లలో 482 పరుగులకి ఆలౌటైంది.

మోకాలి గాయంతో ఇబ్బంది పడుతోన్న హరీశ్

మోకాలి గాయంతో ఇబ్బంది పడుతోన్న హరీశ్

2015 నుంచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతోన్న హరీశ్ సోహైల్ ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అసద్‌ షఫీక్‌ (165 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 255/3తో సోమవారం బ్యాటింగ్‌ కొనసాగించిన పాకిస్థాన్ జట్టులో హరిస్, అసద్‌ ముందుకు నడిపించారు.

ఐదో వికెట్‌కు 150 పరుగులు

ఐదో వికెట్‌కు 150 పరుగులు

వీరిద్దరూ ఐదో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో వీరిద్దరి వికెట్లను వెంట వెంటనే కోల్పోవడం... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్‌ అజమ్‌ (4) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (15) కూడా విఫలమవడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ తొందరగానే ముగిసింది.

నేను అమాయకుడ్ని

నేను అమాయకుడ్ని

ఆసీస్ బౌలర్లలో సిడిల్‌ 3, నాథన్‌ లయాన్‌ 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం హరీశ్ సొహైల్ మాట్లాడుతూ "నేను అమాయకుడ్ని (నవ్వుతూ). ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాపై స్లెడ్జింగ్‌కి (అసందర్భ పదజాలం వాడటం) ప్రయత్నించారు. దీంతో బ్యాటింగ్ చేస్తున్నంతసేపు వారివైపు చూడటం మానేశాను" అని తెలిపాడు.

రెండు మూడు సార్లు వారు స్లెడ్జింగ్‌కి ప్రయత్నించారు

రెండు మూడు సార్లు వారు స్లెడ్జింగ్‌కి ప్రయత్నించారు

"అయినా సరే రెండు మూడు సార్లు వారు స్లెడ్జింగ్‌కి ప్రయత్నించారు. చివరకు నేను వారి మాటలు విననట్లే నటించాను. గత మూడేళ్లుగా గాయంతో నేను బాధపడ్డాను. చాలా అంశాలు నాకు ప్రతికూలంగా జరిగాయి. అయినప్పటికీ.. పట్టుదలతో ఫిట్‌నెస్ సాధించి.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది" అని సోహైల్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 9, 2018, 17:41 [IST]
Other articles published on Oct 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+