Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవ్వు ఆపుకోలేకపోయా: పంజాబ్ గెలుపుపై ప్రీతి జింటా ఫన్నీ ట్వీట్

When Ashwin leads, KL rahul sets a new record, Mujeeb Zadran debuts at 17


హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా జరిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు శుభారంభం చేయడంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా సంతోషంలో మునిగి తేలుతోంది. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని నమోదు చేయడంతో కరుణ్ నాయర్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

పంజాబ్ జట్టు సాధించిన తొలి విజయంపై ఆ జట్టు సహా యజమాని ప్రీతి జింటా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. 'కొత్త కెప్టెన్ అశ్విన్‌ నాయకత్వంలో కేఎల్‌ రాహుల్‌ రికార్డు నమోదు, ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన అప్ఘన్ యువ క్రికెటర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, కరుణ్ నాయర్‌ ప్యాక్స్‌ పంచ్‌లతో మ్యాచ్‌ ఆసాంతం నా నవ్వును ఆపుకోలేకపోయాను' అని ట్విట్టర్‌లో పేర్కొంది.

ప్రీతి జింటా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాళ్లు రెండు రికార్డులను బద్దలు కొట్టారు. పంజాబ్ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు యూసఫ్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల వేగవంతమైన సెంచరీ రికార్డుని కేఎల్ రాహుల్ అధిగమించాడు. ఇక, 17 ఏళ్ల 11 రోజుల వయసుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ ఘనత సాధించాడు. ఈ రికార్డు 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ పేరిట ఉంది.

Story first published: Monday, April 9, 2018, 14:28 [IST]
Other articles published on Apr 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+