Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దాదా భయపడకు, నేను చూసుకుంటా: గంగూలీతో చెప్పిన ఒకే ఒక్కడు

హైదరాబాద్: టీమిండియా వెటనర్ పేసర్ ఆశిష్ నెహ్రా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20తో క్రికెట్‌‌కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెహ్రాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

1999లో శ్రీలంకతో టెస్ట్‌ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు. క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు నెహ్రా ఎదుర్కొన్నాడు. జట్టులో అనేకమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

సహచరులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నా.. ఏ మాత్రం నెరవకుండా జాతీయజట్టులో చోటు దక్కించుకుని యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. 2003 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఒక ఎడమచేతి వాటం పేసర్‌కు ఇదే అత్యుత్తమం కావడం విశేషం.

 చివరి ఓవర్‌ను ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో గంగూలీ

చివరి ఓవర్‌ను ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో గంగూలీ

2004లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ చివరి ఓవర్‌ను ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా' అని నెహ్రా అభయమిచ్చాడు. ఈ విషయాన్ని

నెహ్రా ఫేర్‌వెల్‌ సందర్భంగా మాజీ క్రికెటర్ బదానీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

 2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది

2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది

'2004లో జరిగిన ఆ సంఘటన నాకు గుర్తుంది. కరాచీలో భారత్‌, పాకిస్థాన్‌ చావోరేవో అన్నట్టు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 350 పరుగుల చేసింది. రెండో ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో తొమ్మిదో.. పదో పరుగులు చేస్తే పాక్‌ విజయం సాధిస్తుంది. అప్పుడు చివరి ఓవర్‌ ఎవరికివ్వాలని గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు' అని తెలిపాడు.

గంగూలీ వద్దకు వచ్చిన నెహ్రా

'ఇంతలో ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నెహ్రా.. గంగూలీ వద్దకు వచ్చాడు. ‘దాదా నేను వేస్తా. నువ్వు భయపడకు. మ్యాచ్‌ గెలిచిపించి తీరుతా' అని అన్నాడు. చివరి ఓవర్‌లో నెహ్రా మూడు పరుగులిచ్చి మొయిన్‌ఖాన్‌ వికెట్‌ తీసి అన్నట్టే భారత్‌కు విజయాన్ని అందించాడు' అని బదానీ గుర్తుచేసుకున్నాడు.

 5 పరుగుల తేడాతో భారత్ విజయం

5 పరుగుల తేడాతో భారత్ విజయం

ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నెహ్రా 10 ఓవర్లు వేసి 58 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 'గంగూలీకి నువ్వు భయపడకని దాదాకే చెప్పిన వ్యక్తి. ఎన్నో గాయాలతో సానుకూలంగా పోరాడిన వీరుడు. పోరాట పటిమగలవాడైన నెహ్రాకు వీడ్కోలు తర్వాత జీవితం అద్భుతంగా ఉండాలి. నెహ్రా మీరు దేశం తరఫున ఆడి భారత జెండాను అత్యున్నత స్థాయిలో నిలిపారు' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+