హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు తన కెరీర్‌లోనే చివరి మ్యాచ్. 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా తన సొంత మైదానంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆశిష్ నెహ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
కెరీర్‌లో అనేక సార్లు గాయాల బారిన పడిన నెహ్రా ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటాడు. ఫిట్‌నెస్‌తో నెహ్రా కోహ్లీకి పోటీనిస్తున్నాడని సెహ్వాగ్ ఇటీవల కామెంట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. రోజూ 8 గంటలపాటు ప్రాక్టీస్ కోసం కష్టపడే నెహ్రాకు ఆట పట్ల నిబద్ధత ఎక్కువ.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ మాత్రం పొరబాటు జరిగినా తట్టుకోలేడు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించడు. ఓ సారి క్యాచ్ వదిలేశాడనే కారణంతో ధోనీని తిట్టేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. నెహ్రా విసిరిన బంతి ఆఫ్రిదీ బ్యాటింగ్‌కు తగిలి కీపింగ్ చేస్తున్న ధోని, ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ద్రవిడ్ మధ్య నుంచి దూసుకెళ్లింది.
దీంతో ఆఫ్రిదీ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ క్యాచ్ వదిలేశాడనే కోపంతో నెహ్రా ధోనిని తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు నెహ్రా తన క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి.
నెహ్రా తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సార్లు గాయాలు పాలయ్యాడు. తన కెరీర్ మొత్తంలో 12 సార్లు సర్జరీలు చేయించుకున్నాడు. 1999లో శ్రీలంకతో టెస్ట్‌ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు.
టెస్టులకు 2004లో, వన్డేలకు 2011 వరల్డ్ కప్ తర్వాత, 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైరైన నెహ్రా టీ20ల్లో మాత్రం కొనసాగాడు. భారత్ తరుపున 26 టీ20లు ఆడి 34వికెట్లు తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో 3/19 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.