బెంగళూరు: బాలీవుడ్ నటి అనుష్క శర్మ టీమీండియా ఆటగాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ చిత్రాన్ని స్కెచ్ వేశారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు అనుష్క శర్మ హాజరయ్యారు.
ఈ మ్యాచ్‌కు బాంబే వెల్వేట్ కో స్టార్ రణ్‌బీర్ కపూర్ వచ్చారు. ఆ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మీకు ఇష్టమైన ఆటగాడి స్కెచ్ వేయాలని అడగగా.. ఇరువురు కూడా, అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ స్కెచ్ వేశారు!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. తొలుత వారిద్దరు గుట్టు చప్పుడు కాకుండా తిరిగారు. ఇటీవల వారు మీడియా కళ్లబడేలా కూడా బయట కనిపిస్తున్నారు.
ఈ రోజు (మే 1) అనుష్క శర్మ తన 27వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనుష్క పుట్టిన రోజు నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆమెను కలిసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.