Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాత్యాంహర వ్యాఖ్యలు: జోఫ్రా ఆర్చర్‌కు పెరుగుతున్న మద్దతు

Whatever the abuse, wed be right behind Jofra Archer: England team director Ashley Giles

హైదరాబాద్: ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై న్యూజిలాండ్ అభిమాని చేసిన జాత్యాంకార వ్యాఖ్యలపై టీమ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ మండిపడ్డాడు. మన సమాజంలో ఈ తరహా వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్‌లో జరిగిన మొదటి టెస్టు ఐదో రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇప్పటికే ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు కూడా తెలియజేసింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింతగా పెంచుతున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

ఆష్లే గైల్స్‌ మాట్లాడుతూ

ఆష్లే గైల్స్‌ మాట్లాడుతూ

జోఫ్రా ఆర్చర్‌పై జాత్యహంకర వ్యాఖ్యలపై ఇంగ్లాండ్‌ జట్టు డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ మాట్లాడుతూ "ఇది నిజంగా చాలా దురదృష్టకరం. మన సమాజంలో ఈ తరహా వ్యాఖ్యలు ఇంకా వినిపించడం సిగ్గుచేటు. స్టేడియంలోని కొంతమంది ఆర్చర్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. స్కోరు బోర్డు ఏరియాకు సమీపంలో కూర్చొని ఉన్న పలువురు ఆర్చర్‌ను దూషించారు" అని తెలిపాడు.

జాత్యహంకార దుర్వినియోగం అని అర్ధమైంది

"ఇది నేరం. అతను బయలుదేరిన వెంటనే జోఫ్రా ఈ విషయాన్ని స్టీవార్డ్‌కు నివేదించాడు. అతడు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన వెంటనే మా సెక్యూరిటీకి నివేదించాడు. ఇది జాత్యహంకార దుర్వినియోగం అని అర్ధమైంది. ఈ విషయంలో ఆర్చర్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. నాపై జాత్యహంకర వ్యాఖ్యలు చేసి అవమానించారని ఆర్చర్‌ ట్వీట్‌ చేయడం చాలా బాధనిపించింది" అని పేర్కొన్నాడు.

ఆర్చర్‌ మా జట్టులో సభ్యుడు

ఆర్చర్‌ మా జట్టులో సభ్యుడు

"ఆర్చర్‌ మా జట్టులో సభ్యుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. క్రికెట్‌లో జాత్యహంకర వ్యాఖ్యలకు చోటు లేదు. ఆర్చర్‌కు మేము అండగా ఉంటాం" అని గైల్స్‌ వెల్లడించాడు. బార్బోడాస్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 26, 2019, 15:11 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+