For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AFG: ఎంత పనిచేశావ్ రింకూ.. సూపర్ ఓవర్‌‌‌కు కారణాలు ఇవే!

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా రెండో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలిన మొదటి మ్యాచ్‌గా ఈ పోరు చరిత్ర సృష్టించింది. అయితే సూపర్ ఓవర్‌ వరకు మ్యాచ్ చేరకుండానే టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో మ్యాచ్ టైగా ముగించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. 22/4తో కష్టాల్లో నిలిచిన జట్టును రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో), రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుతంగా పోరాడి ఆదుకున్నారు. ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు 212/6 స్కోరుతో నిలిచి మ్యాచ్‌ను 'టై' గా ముగించింది. గుర్బాజ్ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో), నైబ్ (55; 23 బంతుల్లో), నబి (34; 16 బంతుల్లో) పోరాడారు.

What you have done Rinku Singh. These are the reasons for the super over!

ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 16 పరుగులే చేయడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయం సాధించింది. అయితే అంతకుముందు భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మాత్రమే మంచి ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

కానీ, సుందర్‌కు మూడు ఓవర్లు బౌలింగ్ ఇవ్వడం అఫ్గానిస్థాన్‌కు కలిసొచ్చింది. తొలి సారి ఏడో ఓవర్‌లో సుందర్‌తో బౌలింగ్ చేయించారు. మూడు పరుగులే ఇచ్చి అఫ్గాన్ జోరుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత అతడు మరోసారి బంతిని అందుకోవడం కోసం 13 ఓవర్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ ఓవర్‌లో వికెట్ కూడా పడగొట్టాడు. అయితే అతడితో బౌలింగ్ కొనసాగించకుండా 17 ఓవర్‌‌లో అవకాశం ఇచ్చారు. ఆఖర్లో స్పిన్నర్‌కు బౌలింగ్‌కు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేసర్లుకు రోహిత్ బంతిని అందించాడు.

What you have done Rinku Singh. These are the reasons for the super over!

సుందర్‌ను మిడిల్ ఓవర్లలో సంపూర్ణంగా వినియోగించలేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. అలాగే ఇద్దరు బౌలర్లతో స్పెల్‌ను కొనసాగించకుండా ముగ్గరు బౌలర్లతో బౌలింగ్ ప్రయోగం కొంపముంచింది. మరోవైపు పేసర్లు అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తీవ్ర నిరాశపరిచారు. అర్షదీప్ స్థానంలో వచ్చిన అవేశ్ ఖాన్ ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ 44 పరుగులు ఇచ్చాడు. ఆఖర్లో అఫ్గాన్ బ్యాటర్లను కట్టడిచేయలేక చేతులెత్తేశారు. రవి బిష్ణోయ్ కూడా ధారళంగా పరుగులు ఇవ్వడం కొనసాగించాడు.

కాగా, అఫ్గాన్ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ముకేశ్ వేసిన చివరి బంతిని నైబ్ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రింకూ సింగ్ చెత్తగా త్రో విసిరాడు. స్టంప్స్ వైపు కాకుండా పిచ్ మీదకు రింకూ వేసిన త్రోను అందుకోవడానికి వికెట్ కీపర్ సంజు శాంసన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో రనౌట్ చేసే ఛాన్స్ మిస్ అయ్యింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

Story first published: Thursday, January 18, 2024, 9:20 [IST]
Other articles published on Jan 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+