Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామ, పూరన్‌ను కూడా సాగనంపుండ్రి భయ్: తల తిక్క నిర్ణయాలేంది..?

What Twitter reaction over Sunrisers Hyderabad appointed Brian Lara as its Head Coach?.

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై అభిమానుల నుంచి డివైడెడ్ టాక్ వినిస్తోంది. కొత్త హెడ్ కోచ్‌గా వెస్టిండీస్‌కు చెందిన లెజెండర్ బ్రియాన్ లారా‌ను నియమించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉన్న టామ్ మూడీ స్థానంలో లారాను తీసుకోవడాన్ని కొందరు అభిమానులు సమర్థిస్తోండగా.. మరి కొందరు తప్పుపడుతున్నారు. తల తిక్క నిర్ణయాలంటూ వ్యాఖ్యానిస్తోన్నారు.

మూడీని తప్పించి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా టామ్ మూడీని తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్- ఆయన స్థానంలో లారాను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే ఆయనను తప్పించింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ పొడిగించవద్దంటూ టామ్ మూడీ సైతం కోరారని తెలిపింది. ఇప్పటికే రెండు దఫాలుగా టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను పొడిగించింది సన్‌రైజర్స్. మూడోసారి ఆ అవకాశం ఇవ్వలేదు.

కొత్త బాధ్యతల్లో మూడీ..

వచ్చే ఏడాది జనవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ20కి చెందిన డెసర్ట్ వైపర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌గా టామ్ మూడీ అపాయింట్ అయ్యారు. ఆయనకు ఎస్‌ఆర్‌హెచ్ గుడ్‌బై చెప్పడానికి ఇదొక కారణం. ఐపీఎల్, ఐఎల్టీకి ఒకేసారి సేవలను అందించడంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో టామ్ మూడీకి వీడ్కోలు పలకాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావించింది. వీడ్కోలు పలికింది.

ఇక అటాకింగ్..

లారా రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇక అటాకింగ్ మూడ్‌లోకి వెళ్తుందంటూ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోన్నారు. లారా డైరెక్షన్.. ప్లేయర్లకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2023లో కొత్తరకం సన్‌రైజర్స్ చూస్తామనే ధీమా వ్యక్తం చేస్తోన్నారు. లారాను హెడ్ కోచ్‌గా అపాయింట్ చేయడం ద్వారా కావ్యా మారన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అదేస్థాయిలో జట్టును కూడా తీర్చిదిద్దుకోవాలని సూచిస్తోన్నారు.

వరస్ట్ డెసిషన్..

మరికొందరు అభిమానులు.. దీనికి భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ప్లేయర్లనే కాకుండా కోచ్‌ను కూడా తీసుకోవడం సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ చేతకావట్లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడే గానీ కోచ్‌గా పని చేసిన అనుభవం బ్రియాన్ లారాకు లేదని, అలాంటప్పుడు అతనిపై ఎలా నమ్మకాన్ని ఉంచుతుందని ప్రశ్నిస్తోన్నారు. ఓ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించినప్పటికీ.. లారా మాత్రం కోచ్ మెటీరియల్ కాదని తేల్చి చెబుతున్నారు.

పూరన్‌ను కూడా..

కేప్టెన్ కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాటర్ నికొలస్ పూరన్‌ను కూడా తొలగించాలంటూ మరి కొందరు ఫ్యాన్స్ సూచిస్తోన్నారు. పూరన్ స్థానంలో జానీ బెయిర్ స్టోను జట్టులోకి తీసుకోవాలని సలహా ఇస్తోన్నారు. జట్టు అగ్రెసివ్‌గా ఆడాల్సిన అవసరం ఉందని, అలాంటి ప్లేయర్లను తీసుకోవాలని చెబుతున్నారు. ప్లేయర్లు సరిగ్గా ఆడలేనప్పుడు కోచ్ ఏం చేయగలుగుతాడని, అందుకే జట్టును ఆల్‌రౌండర్లతో నింపాలంటూ కామెంట్స్ చేస్తోన్నారు.

Story first published: Saturday, September 3, 2022, 14:31 [IST]
Other articles published on Sep 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+