Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: అతని గురించి ఏం చెప్పగలను?- సెహ్వాగ్ ఎమోషనల్ పోస్ట్

టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. అయితే కప్‌ను కైవసం చేసుకున్న అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్-కోహ్లి ప్రకటించారు. దశాబ్ద కాలం పాటు భారత విజయాల్లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నారు.అన్నిఫార్మాట్లలో భారత బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా సేవలు అందిస్తున్నారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇద్దరిని కొనియాడుతూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ల్లో కోహ్లి ఒంటిచేత్తో మ్యాచ్‌‌లను గెలిపించాడని, అతను అసలైన టీ20 వరల్డ్ కప్ బ్యాటర్ అని కొనియాడాడు. కోహ్లి ఇతర ఫార్మాట్లలో కూడా అదే జోరును కొనసాగించాలని ఆశించాడు. మరోవైపు రోహిత్ అన్ని టీ20 ప్రపంచకప్‌లు ఆడిన ఘనుడు అని, కెప్టెన్‌గా జట్టులో గొప్ప వాతావరణాన్ని సృష్టించాడని ప్రశంసించాడు.

What to say about Virat the Greatest T20 World Cup Batsman- Virender Sehwag

''టీ20 వరల్డ్ కప్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అతని గురించి ఏం చెప్పగలను? కోహ్లి అత్యుత్తమ టీ20 ప్రపంచకప్ బ్యాటర్. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ల్లో క్లిష్టపరిస్థితుల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. 2022లో మెల్‌బోర్న్‌లో టీ20 చరిత్రలో నిలిచిపోయేలా పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ తన క్లాస్‌ను చూపించాడు. అతను సాధించిన పరుగులు కంటే ఆడే విధానం అతన్ని ప్రతిబింబిస్తోంది. తనకు మించిన పాత్రలు పోషించాడు. గురు దయ వల్ల ఇది సాధ్యమైంది''

''కోహ్లి టీ20 కెరీర్‌కు గొప్ప ముగింపు దక్కింది. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా అతను గొప్ప ప్రమాణాలను కొసాగించాలని కోరుకుంటున్నాను. ఇక.. తొమ్మిది టీ20 వరల్డ్ కప్‌లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. గతేడాది నుంచి తన ఆటను మరింత దూకుడుగా మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. అంతేగాక జట్టులో మంచి వాతావరణాన్ని తీసుకువచ్చాడు. ఇది టీమ్‌కు ఎంతో అవసరం. సత్ఫలితాలను ఇచ్చాయి. తనని తాను మలుచుకున్న తీరు పట్ల గర్వపడుతున్నా. భవిష్యత్‌లో కూడా అతనికి కలిసి రావాలని కోరుకుంటున్నా'' అని సెహ్వాగ్ అన్నాడు.

Story first published: Monday, July 1, 2024, 12:36 [IST]
Other articles published on Jul 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+