న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్ని సార్లు డకౌట్‌ అయ్యానో నాకే తెలీదు: సచిన్

What The Duck: In conversation with Sachin Tendulkar

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, టీమిండియా సీనియర్ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు తన గురించి తనకే తెలియని సీక్రెట్ ఒకటి ఉందట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ వెల్లడించాడు. సచిన్ తన కెరీర్‌లో ఎన్నిసార్లు డకౌట్ అయ్యాడో అని అడిగిన ప్రశ్నకు తెలీదంటూ సమాధానమిచ్చాడు.

ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్, కమెడియన్ విక్రమ్ సత్యాయే యాంకరింగ్ వహిస్తున్న 'వాట్‌ ద డక్' అనే ఓ కార్యక్రమంలో సచిన్ తన కెరీర్‌లో ఎన్నిసార్లు డకౌట్ అయ్యారో తెలుసుకున్నారు. అంతేకాక.. తన కెరీర్‌లో అత్యంత చెత్త డకౌట్‌ల గురించి వివరించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సచిన్‌ని విక్రమ్ తన కెరీర్‌లో అత్యంత చెత్త డకౌట్ ఏంటి అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ''నా కెరీర్‌ను ప్రారంభించిన మొదటి రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. మొదటి మ్యాచ్‌లో మొదటి బంతికే ఔట్ అయ్యా. ఆ తర్వాతి మ్యాచ్‌లో మూడు బంతులు ఆడాను, కానీ సున్న పరుగులకే వెనుదిరిగాను. కానీ ఆ మ్యాచ్‌లో కనీసం మూడు బంతులు అయినా ఎదురుకున్నాను అని తృప్తిపడ్డా'' అని సచిన్ తెలిపారు.

ఈ షోలో ఎన్నో అనుభావాలను సచిన్ అభిమానులతో పంచుకున్నారు. అయితే చివర్లో సచిన్‌కి కానుకగా విక్రమ్ ఓ టీ-షర్టుని బహుకరించాడు. దానిపై సచిన్ పేరుతో పాటు 34 అనే సంఖ్య రాసి ఉంది. అది చూసి షాక్ అయిన సచిన్ ఆ 34 సంఖ్య ఏంటా అని ప్రశ్నించాడు. అప్పుడు విక్రమ్ ఇది మీ కెరీర్‌లో మీరు డకౌట్లు అయిన సంఖ్య అని చెప్పడంతో సచిన్ ఒక్కసారిగా షాక్‌తో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.

Story first published: Wednesday, May 16, 2018, 21:18 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X