Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిజంగానే స్మిత్‌కు బుర్ర లేదు: బాల్‌ ట్యాంపరింగ్‌‌పై స్పందించిన గంగూలీ

What Smith did was absolute stupidity, says Sourav Ganguly; calls ball-tampering act as actual brain fade

హైదరాబాద్: భవిష్యత్తులో కూడా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ను చూడాలనుకోవట్లేదని భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీ అన్నాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలసిందే. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.

ఈ ఘటనపై ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడగా, తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడతూ 'ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా ఆలోచనలో అర్థం లేదు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ అలా చేయకుండా ఉండాల్సింది. బాల్‌ ట్యాంపరింగ్‌ తెలివి తక్కువ పని' అని అన్నాడు.

'గతేడాది బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులోడీఆర్ఎస్ రివ్యూ వివాదం సమయంలో తన బుర్ర పని చేయలేదని అతను అంటే ఏదో మాట వరసకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజంగా స్మిత్‌కు బుర్ర లేదని నాకర్థమైంది. 1981 నుంచి ఆస్ట్రేలియా ఇదే తరహాలో క్రికెట్‌ ఆడుతోంది' అని దాదా పేర్కొన్నాడు.

'భవిష్యత్తులో కూడా ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ను చూడాలనుకోవట్లేదు. అలాగే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా చేయొద్దు. కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ను ఆ పదవి నుంచి తప్పించాలి. బాల్‌ టాంపరింగ్‌ అనేది మ్యాచ్‌ ఫిక్సింగ్ కంటే పెద్ద నేరం కాదు. కానీ, ప్రస్తుతం స్మిత్‌పై విధించిన ఐసీసీ విధించిన నిషేధం సరిపోదు' అని అన్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఆ దేశ ప్రధాని దీనిపై చర్యలు తీసుకోవాలని గంగూలీ సూచించాడు. బాల్ టాంపరింగ్‌ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్‌తో తప్పు చేయించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.

టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది. మూడో టెస్టులో సీనియర్ ఆటగాళ్లు అందరం కలిసి బాల్ టాంపరింగ్ చేయాలని ప్లాన్ నిర్ణయించినట్లు స్మిత్ చెప్పడంతో కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు వీలైనంత ఎక్కువ శిక్ష విధించే అవకాశం ఉంది.

క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిబంధనల ప్రకారం మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ అభిమానులు సైతం వీళ్లిద్దరిపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది.

Story first published: Tuesday, March 27, 2018, 10:01 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+