న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం గంగూలీలాగే: కెరీర్ ఆఖర్లో ధోని విమర్శలు, వరల్డ్‌కప్‌లో బెర్తు దక్కేనా!

By Nageshwara Rao
What separates Dhonis final Team India days from those of Ganguly

హైదరాబాద్: సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ... బీసీసీఐ టీమిండియాకు అందించిన అత్తుత్తమ కెప్టెన్లు అనడంలో ఎలాంటి సందేహాం లేదు. తమ అద్భుత ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.

ఒకరేమో జట్టుకు దూకుడు నేర్పిస్తే, మరొకరు నరాలు తెగే ఉత్కంఠలో కూడా ప్రశాంత వదనంతో కనిపిస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఈ ఇద్దరూ తమ కెప్టెన్సీతో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు.

అయితే, కెరీర్ చరమాంకంలో జట్టుకు భారంగా మారి అభిమానుల చేత సూటిపోటీ మాటలు ఎదుర్కొన్నారు. సౌరవ్ గంగూలీ ఎలాగైతే తన కెరీర్ ఆఖర్లో పేలవ ప్రదర్శన చేసి అభిమానుల విమర్శలు ఎలాగైతో ఎదుర్కొన్నాడో... ఇప్పుడు ధోని కూడా అలానే విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

తన సహాజశైలికి భిన్నంగా ధోని బ్యాటింగ్

తన సహాజశైలికి భిన్నంగా ధోని బ్యాటింగ్

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన సహాజశైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసిన ధోని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ధోని బ్యాటింగ్ తీరు చూస్తే బంతిని బ్యాటుకు తాకిచ్చేందుకు తెగ ఇబ్బందిపడ్డాడు. తన చెత్త ఇన్నింగ్స్‌ను ధోనీ గుర్తుకు తెచ్చాడని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ధోని ఫిట్‌నెస్ పరంగా వీక్‌గా ఉన్నాడంటే... అదీ లేదు. ఇప్పటికీ యువ క్రికెటర్లకు దీటుగా ధోనీ ఫిట్‌నెస్ పరీక్షలు నెగ్గుతూ వస్తున్నాడు.

 ఊహించని రీతిలో వికెట్లను గిరాటేస్తోన్న ధోని

ఊహించని రీతిలో వికెట్లను గిరాటేస్తోన్న ధోని

యో-యో టెస్టులో ఎక్కువ మార్కులతో పాసవుతున్నాడు. అంతేకాదు మెరుపు వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఊహించని రీతిలో వికెట్లను గిరాటేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్‌లోనే అభిమానులను అలరించలేకపోతున్నాడు. ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచిన ధోని గతంలో అనేక భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ధోని బ్యాట్ నుంచి సరైన ఇన్నింగ్స్ జాలు వారలేదు. ఇప్పుడు ధోనికి ఏమైందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఆరు, ఏడు నంబర్లలో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీపై భారం

ఆరు, ఏడు నంబర్లలో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీపై భారం

భారత జట్టులో నాలుగో స్థానంలో ఆడే సరైన బ్యాట్స్‌మెన్ కోసం సెలక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, రహానే, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, కేదార్‌జాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఇలా ఎంతమందికి అవకాశమిచ్చినా ఆ స్థానంలో కుదురుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు, ఏడు నంబర్లలో బ్యాటింగ్‌కు వచ్చే ధోనీపై భారం పడుతోంది. ఓవైపు వికెట్లు పడిపోవడం, లోయర్ ఆర్డర్‌లో కలిసి పరుగులు రాబట్టడం ధోనికి తలకు మించిన భారంగా మారింది. మరోవైపు ధోని వయసు పైబడటం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.

 ధోని ఫామ్ ఇలాగే కొనసాగితే!

ధోని ఫామ్ ఇలాగే కొనసాగితే!

ఇలాగే, ధోని పేలవ ఫామ్ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ వరకు కూడా ఆడటం కష్టమే. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీకున్న అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ కోహ్లీ, అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు టీమిండియాలో బెర్తు కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ లాంటి యువ వికెట్‌కీపర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనుంది.

సెలక్టర్లు నిర్ణయం ఎటువైపు

సెలక్టర్లు నిర్ణయం ఎటువైపు

ఈ వరల్డ్‌కప్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో జట్టు కూర్పుపై సెలక్టర్లు ఓ అంచనా రావాల్సి ఉంది. పేస్ బౌలింగ్‌కు సహకరించే ఇంగ్లిష్ పిచ్‌లపై రాణించాలంటే అనుభవంతో పాటు నేర్పు కూడా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో అపార అనుభవం ఉన్న ధోని వైపు మొగ్గుచూపుతారా? లేక యువతకు అవకాశం ఇస్తారా? అన్నది టీమిండియా సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Story first published: Friday, July 20, 2018, 13:08 [IST]
Other articles published on Jul 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X