Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, కోహ్లీ వల్ల కానిది.. ఈ కుర్రాడు సాధించాడు!

భారత క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2026 అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల యూత్ సిరీస్ కోసం సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీ చేతికి జట్టు పగ్గాలు అప్పగించారు. ఇంత చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలు ఇవే..

1.ఆయుష్ మాత్రేకు గాయం
నిజానికి ఈ జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఆయుష్ మాత్రే మణికట్టుకు గాయం కావడంతో అండర్-19 ప్రపంచకప్ దృష్ట్యా బీసీసీఐ అతనికి విశ్రాంతిని ఇచ్చింది. ప్రపంచ కప్ నాటికి ఆయుష్ మాత్రే ఫిట్‌గా ఉండాలని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్ మాత్రే అందుబాటులో లేకపోవడంతో జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు.

What Sachin and Kohli Couldn t Do This 14-Year-Old Achieved Vaibhav Suryavanshi Named India U19 Captain

2.అద్భుత ఫామ్.. రికార్డుల సెంచరీలు
గడిచిన ఏడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-19 ఆసియా కప్‌లో, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. అతని నిలకడైన ప్రదర్శనకు ప్రతిఫలంగానే సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ గౌరవాన్ని ఇచ్చారు.

3.భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దడం
వైభవ్ సూర్యవంశీ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉందని బీసీసీఐ గుర్తించింది. 14 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటున్న ఇతనికి కెప్టెన్సీ ఒత్తిడిని అలవాటు చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటే, భవిష్యత్తులో అండర్-19 ప్రపంచకప్‌కు లేదా దేశవాళీ క్రికెట్‌లో బీహార్ జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత యూత్ వన్డే జట్టు:
వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మహమ్మద్ ఏనన్, హేనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.

Story first published: Sunday, December 28, 2025, 11:47 [IST]
Other articles published on Dec 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+