ఆర్మీకి ధోని సేవలపై ఇంగ్లాండ్ క్రికెటర్ వ్యంగ్యం: ట్విట్టర్‌లో ఆడుకున్న అభిమానులు

David Lloyd Gets Trolled For Cheeky Tweet On MS Dhoni || Oneindia Telugu

హైదరాబాద్: రిటైర్మెంట్‌ను పక్కన బెట్టి రెండు నెలలు పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించి సైన్యలోకి చేరాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను అతడి అభిమానులు కొనియాడుతుంటే... ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్‌.. ధోనిని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు నెలలు ధోని పారామిలటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ రెండు నెలలు ధోని పారాచూట్‌ రెజిమెంట్‌ విభాగంలో చేరి దేశ సైనికుడిగా సేవలందిస్తాడు. ఈ రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించేందుకు భారత్ ఆర్మీ ఛీఫ్ సైతం అంగీకరించారు.

అయితే, ధోని రెండు నెలల పాటు ఆర్మీకి సేవ చేయబోతున్నాడంటూ వచ్చిన వార్తలపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. "కాల్ ఆఫ్ డ్యూటీ.. సైన్యంలో చేరే ఉద్దేశంతో ధోని విండీస్‌ పర్యటనకు దూరం కానున్నాడు" అంటూ ఓ స్పోర్ట్స్ చానెల్‌ చేసిన ట్వీట్‌కు ఎగతాళిగా పశ్చాతాపంతో నవ్వుతున్నట్టుగా ఉన్న ఎమోజీలతో రీట్వీట్ చేశాడు.

ఇది ధోని అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. సోషల్‌ మీడియా వేదికగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్‌‌పై ట్రోలింగ్‌కు దిగారు. "9 టెస్ట్‌లు ఆడిన నువ్వా.. మా ధోని గురించి మాట్లాడేది" అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. కాగా, మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జన్మించిన డేవిడ్ లాయడ్ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 22, 2019, 19:40 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X