

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు పొడచూపాయా? లేదంటే ఏదైనా విషయంలో వారిద్దరూ గొడవ పడ్డారా? ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మకు చోటివ్వలేదని హిట్ మ్యాన్ అలిగాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంతా అని అనుకుంటున్నారు.

అందుకు కారణం లేకపోలేదు ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ అన్‌ఫాలో చేశాడు అందుకు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు గానీ సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ అన్‌ఫాలో చేశాడన్న వార్తలు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
దీంతో వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటూ ట్విటర్‌లో అభిమానులు తెగ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోహ్లీని, రోహిత్‌ను ట్యాగ్ చేస్తున్నారు. అసలు రోహిత్ శర్మ ఎందుకు ఈ పని చేశాడో ఎవరికీ తెలియడం లేదు. దీనిపై కోహ్లీ, రోహిత్ శర్మ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటేనే ఓ స్పష్టత వస్తుంది. ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్‌లో ఉండగా రోహిత్ శర్మ ముంబైలో ఉన్నాడు.
సెప్టెంబర్ 15 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్‌కు సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చి సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేశారు.