Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

207, సెంచరీ: పలు రికార్డ్‌లు బద్దలు కొట్టిన రోహిత్

పెర్త్: భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డేలో రోహిత్ శర్మ రాణించాడు. అతను 163 బంతుల్లో 171 పరుగులు చేశాడు. రోహిత్ రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగులు చేసింది. భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. తాజాగా రోహిత్ శర్మ రికార్డులు సృష్టించాడు.

- పెర్త్‌లోని వాగా మైదానంలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ.
- ఆస్ట్రేలియాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారతీయుడిగా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. తాజా వన్డేలో రోహిత్ శర్మ 171 పరుగులు చేశాడు. గతంలో యువరాజ్ సింగ్ పేరిట ఇది ఉంది. 2004లో యువీ ఆస్ట్రేలియాలో 139 పరుగులు చేశాడు.
- పెర్త్‌లో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్సుమెన్ రోహిత్ శర్మ. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ (ఆప్ఘనిస్తాన్ పైన 2015 మార్చిలో) 178 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

What all records did centurion Rohit Sharma break in Perth ODI?

- ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. 19 ఇన్నింగ్సుల్లో పూర్తి చేశాడు.
- వివిఎస్ లక్ష్మణ్ తర్వాత... వన్డేల్లో ఆస్ట్రేలియాలో మూడో సెంచరీ చేసినవాడు రోహిత్ శర్మ.
- ఇది రోహిత్ శర్మకు నాలుగో 150+. రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, జయసూర్య సాధించారు. సచిన్ టెండుల్కర్ 150 పరుగుల కంటే ఎక్కువ ఐదుసార్లు చేశాడు.
- ఆస్ట్రేలియాలో ఆడిన విదేశీ ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వాడు రోహిత్ శర్మ. గతంలో జింబాబ్వేకు చెందిన స్టార్ట్ కార్లిస్లే 119 పరుగులు చేశాడు.
- ఆస్ట్రేలియా పైన నాలుగు సెంచరీలు చేసిన భారతీయుల్లో రోహిత్ శర్మ, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు. వీరికంటే ఎక్కువగా సచిన్ టెండుల్కర్ ఒక్కడే 9 సెంచరీలు చేసాడు.
- రోహిత్ - కోహ్లీలు రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరు ఈ వన్డేలో 207 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గతంలో (లక్ష్మణ్ - టెండుల్కర్‌లు ఇండోర్‌లో 2001లో) 199 పరుగులు చేశారు.
- 207.. ఆస్ట్రేలియాలో ఇది మూడో హయ్యెస్ట్ భాగస్వామ్యం.
- రోహిత్ - కోహ్లీ భాగస్వామ్యంలోని 207 పరుగులు భారత్‌కు రెండో హయ్యెస్ట్ భాగస్వామ్యం. గతంలో 2004 జనవరిలో సిడ్నీలో లక్ష్మణ్ - యువరాజ్ సింగ్‌ల భాగస్వామ్యం 2013 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+