Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైటిల్ గెలవగానే పొలార్డ్ చేసిన పని వైరల్.. బ్రావోకు వీడియో కాల్ చేసి మరీ..!

అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ఎంఐ న్యూయార్క్ టీం గెలుచుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూయార్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ (137 నాటౌట్) అదిరిపోయే ప్రదర్శనతో చెలరేగాడు. దీంతో ఎంఐ న్యూయార్క్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ఎంఐ ప్లేయర్ కీరన్ పొలార్డ్ చేసిన పని వైరల్ అవుతోంది.

ఈ లీగ్‌లో ఎంఐ టీంకి కెప్టెన్‌గా వ్యవహరించిన పొలార్డ్.. ఫైనల్‌లో ఆడలేదు. దీంతో పూరన్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం జరిగింది. అతను ఈ మ్యాచ్ గెలిపించిన తర్వాత పొలార్డ్ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ఎంఎల్‌సీ ఫైనల్‌లో ఎంఐ గెలిచిన వెంటనే.. తన తోటి విండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకు పొలార్డ్ వీడియో కాల్ చేశాడు.

Kieron Pollard

వీళ్లిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. చాలాసార్లు ఇలా వాళ్లు చేయడం ఫ్యాన్స్ చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంఎల్‌సీ వేదికగా కూడా వీళ్లిద్దరూ ఇలా ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వైరల్‌గా మారింది.

ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్ టీం కెప్టెన్‌గా పొలార్డ్ ఆడగా.. డ్వేన్ బ్రావో మాత్రం టెక్సాస్ సూపర్ కింగ్స్ టీంకు ఆడాడు. ఛాలెంజర్ గేమ్‌లో న్యూయార్క్ చేతిలో ఈ టీం ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ గెలిచిన వెంటనే.. తన ఫ్రెండ్ బ్రావోకు పొలార్డ్ వీడియో కాల్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ టోర్నీ విజయంతో పొలార్డ్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల టీ20 టోర్నీల్లో ఆడిన పొలార్డ్‌కు ప్లేయర్‌గా ఇది 16వ టైటిల్. అయితే ఇప్పటికే బ్రావో పేరిట 16 ట్రోఫీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా పొలార్డ్ సమం చేశాడు. వీళ్లిద్దరూ కూడా బెస్ట్ ఆల్‌రౌండర్లే కావడం కూడా గమనార్హం.

Story first published: Monday, July 31, 2023, 14:53 [IST]
Other articles published on Jul 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+