అందరిలా కాదు ఈ అంపైర్, రక్షణ కోసమని తానే సొంతంగా..

హైదరాబాద్: 2014వ సంవత్సరంలో ఇజ్రాయేలులో జరిగిన మ్యాచ్‌లో బంతి తలకు తగలి ఓ అంపైర్ మరణించాడు. బౌలర్లకు, బ్యాట్స్‌మన్‌కు రక్షణ కోసం గ్లౌజులు, ప్యాడ్‌లు, హెల్మెట్‌లు, చాతి నుంచి మొదలుకొని.. మోచేతులతో సహా ప్రత్యేక సౌకర్యాలతో ప్యాడ్‌లు ఉండనే ఉంటాయి. మరి అదే సౌకర్యం అంపైర్లకో.. ఈ విషయానికొస్తే, క్రీజులో బ్యాట్స్‌మన్‌కు ఎదురుగా నిల్చొని మ్యాచ్‌ను జడ్జ్ చేయడం అంపైర్ విధి. దీంతో ఇప్పుడు రక్షణలోనూ వాళ్లకు ధీటుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంపైర్లు.

అంపైర్ బ్రూస్ తన రక్షణ కోసం:
ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లను గమనించినట్లైతే ఎడమచేతికి ఫైబర్ ప్లాస్టిక్‌తో చేసిన ఒక పరికరాన్ని ఓ అంపైర్ ధరించడం చూసే ఉంటారు. మోచేతి నుంచి మణికట్టు వరకు నిటారుగా ఉండి ఆ తర్వాత సర్కిల్ ఉండే ఈ పరికరాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ బ్రూస్ అక్సెన్ ఫోర్డ్ తన రక్షణ కోసం తయారుచేసుకున్నాడు.

2015 ఐపీఎల్ నుంచి వాడుతున్నాడు:
ఓ లాలిపప్‌ను పోలి ఉండే పరికరాన్ని అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ తన ఎడమచేతికి సరిపోయే విధంగా తయారుచేసుకున్నాడు. అతను దీన్ని 2015 ఐపీఎల్ నుంచి వాడుతున్నాడు. ఆ ప్యాడ్ ఆరు మిల్లీ మీటర్ల మందంతో పాలి కార్డొనేట్ పదార్థంతో తయారుచేయబడింది.

షీల్డ్‌కు తగిలి ఎవరైనా క్యాచ్ అందుకుంటే:
ఒకవేళ బంతి అతని షీల్డ్‌కు తగిలి ఎవరైనా క్యాచ్ అందుకుంటే దాన్ని కూడా అవుట్‌గానే పరిగణిస్తారట. అంతేకాదు, అంతర్జాతీయ మ్యాచ్ లలో సైతం మొట్టమొదటి సారి హెల్మెట్ వాడింది కూడా బ్రూస్ కావడం విశేషం.

వేగంగా దూసుకొచ్చే బంతి నుంచి:
టీ20ల్లో బాదడమే ప్రధానం కావడంతో వేగంగా దూసుకొచ్చే బంతి నుంచి కాపాడుకోవడం కోసం దీన్ని ఫోర్డ్ వాడుతున్నాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో, న్యూజిలాండ్, భారత్ వన్డే సిరీస్ (2016)లోనూ ఈ పరికరాన్ని ధరించాడు. మైదానంలో అంపైర్ల రక్షణ కోసం బ్రూస్ చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications