
హైదరాబాద్: మనం నెలవారీ జీతాలు.. 15 రోజుల జీతాలు.. చివరికి వారం రోజుల జీతాలు కూడా చూసే ఉంటాం. కానీ, ఇలా 36 సంవత్సరాల తర్వాత జీతం తీసుకోవడం ఇప్పటివరకూ కొత్త పద్ధతే. దానికి తెరలేపింది కూడా ఎవరో కాదు. భారత్‌కు తొలి క్రికెట్ ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్ సుమారు 36 ఏళ్ల తర్వాత జీతం అందుకున్నాడు. 1978లో కపిల్‌దేవ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
మోదీ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కంపెనీ యాజమాన్యం 1979లో కపిల్‌దేవ్‌కు ఉద్యోగం ఇచ్చింది. 1979నుంచి 1982 వరకు కపిల్ ఆ సంస్థలోనే పనిచేశాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ సమయంలో కపిల్‌దేవ్ తాను పని చేసినందుకు జీతం సరిగా అందుకోలేదట.
తాజాగా ఆ సంస్థ యాజమాన్యం దీనిపై స్పందించి అతనికి అందజేయాల్సిన రూ.2.75 లక్షలను కపిల్‌దేవ్ అకౌంట్‌కు జమచేసింది. కంపెనీ మేనేజర్ రాజేంద్ర శర్మ మాట్లాడుతూ... 1979లో కంపెనీ డైరెక్టర్, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ వైకే మోదీ కోరిక మేరకు కపిల్ దేవ్.. మోదీ గ్రూప్‌లో పని చేశారు. సుమారు మూడేళ్లపాటు కపిల్‌దేవ్ పని చేశారు. కొన్ని నెలలకు మాత్రమే జీతం అందుకున్నారు. పీఎఫ్ కూడా అలాగే పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ లెక్కలన్ని చూసి కపిల్‌దేవ్‌కు అందాల్సిన రూ.2.75లక్షల మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేశాం' అని రాజేంద్ర తెలిపారు.
1978లో అరంగేట్రం చేసిన కపిల్‌దేవ్ 1994లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 131 టెస్టుల్లో 434 వికెట్లను, 225 వన్డేల్లో 253 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా టెస్టుల్లో 5248 పరుగులు, వన్డేల్లో 3783 పరుగులు చేశాడు.