Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Verma: రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ మధ్య తేడా ఏమిటి?

Tilak Verma: ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాగా రాణించలేకపోయాడు. జట్టు ఓటమికి కారణం అయ్యాడు. జట్టు త్వరగా పరుగులు సాధించాల్సిన సమయంలో తిలక్ వర్మ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తిలక్ వర్మ బౌండరీ కొట్టడంలో కూడా విఫలమయ్యాడు.

తిలక్ వర్మ 23 బంతుల్లో కేవలం రెండు ఫోర్లతో 25 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ వర్మ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం చూసి ముంబై జట్టు 19వ ఓవర్ లో అతడిని రిటైర్డ్ ఔట్ చేసింది. దీని తర్వాత తిలక్ వర్మ స్థానంలో మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే ఇంత జరిగినప్పటికీ ముంబై జట్టు మ్యాచ్ గెలవలేకపోయింది. ఒక ఆటగాడిని వ్యూహంలో భాగంగా జట్టు జట్టు ఔట్ అని పిలిచినప్పుడు "రిటైర్డ్ ఔట్" సంభవిస్తుంది. అయితే ఒక ఆటగాడు గాయం కారణంగా మైదానం వదిలి వెళ్లినప్పుడు "రిటైర్డ్ హర్ట్" సంభవిస్తుంది.

What is the Difference Between Retired Out and Retired Hurt in Cricket

రిటైర్డ్ ఔట్ అంటే ఏమిటి?
క్రికెట్‌లో ఒక బ్యాటర్ స్వయంగా లేదా కెప్టెన్ ఆదేశం మేరకు ఔట్ కాకుండా మైదానాన్ని వదిలివేస్తే అతను రిటైర్డ్ ఔట్ అయినట్లు చెబుతారు. ఈ పరిస్థితిలో అంపైర్ అతనికి ఔట్ ఇవ్వడు, కానీ అతను డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్తాడు. ఇలా జరిగినప్పుడు బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్ చేయలేడు. ఆ బ్యాటర్ స్కోరు పక్కన ఔట్ అని రాయబడుతుంది. ఇది జట్టు వ్యూహంలో భాగంగా నిర్ణయం తీసుకోబడుతుంది. గాయం లేదా అత్యవసర పరిస్థితి కారణంగా మైదానాన్ని విడిచిపెట్టే నిర్ణయం కాదు.

రిటైర్డ్ హర్ట్ అంటే ఏమిటి?
క్రికెట్‌లో ఒక బ్యాటర్ గాయం, అనారోగ్యం కారణంగా మైదానాన్ని వదిలివేస్తే దానిని రిటైర్డ్ హర్ట్ అంటారు. ఈ పరిస్థితిలో బ్యాటర్ తన సమస్యను అంపైర్‌కు చెప్పి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లవచ్చు. మంచి విషయం ఏమిటంటే.. రిటైర్డ్ హర్ట్ ఆటగాడు తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయగలడు. కానీ అది జట్టు వికెట్ పడిపోయినప్పుడు లేదా మరొక ఆటగాడు రిటైర్డ్ అయినప్పుడు మాత్రమే. అంటే గాయపడిన ఆటగాడు చికిత్స తీసుకుని మరొక ఆటగాడు ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయవచ్చు.

రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ మధ్య తేడా ఏమిటి?
గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాటర్ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి తిరిగి రావచ్చు. కానీ రిటైర్డ్ ఔట్ అయిన బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్ చేయలేడు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ అయినప్పుడు మళ్లీ బ్యాటింగ్ కు రాలేకపోయాడు. ఇదే రెండింటి మధ్య అతి ముఖ్యమైన తేడా.

Story first published: Saturday, April 5, 2025, 12:12 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+