Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS NZ: నెం.76తో కోహ్లీ, రోహిత్‌కు స్పెషల్ కనెక్షన్ - ఏంటో తెలుసా?

కోహ్లీ, రోహిత్ తో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గడం కష్టమే అన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అన్న మాట‌లు కూడా వినిపించాయి. కానీ వాటిని పటాపంచ్ లు చేస్తూ.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ-రోహిత్ అద్భుత ప్రదర్శన చేశారు. 2027 ప్రపంచ కప్ వరకు తమ ఫిట్‌నెస్ కు ఏం ఢోకా లేదని, అప్పటివరకు ఆటలో కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తో... కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు, కోహ్లీకి '76' నెంబర్‌తో ప్రత్యేక సంబంధం ఏర్పడింది. ప్రస్తుతం ఇది క్రికెట్ వర్గాలు స్పెషల్ నెంబర్ గా నిలిచింది.

రోకో-స్పెషల్ కనెక్షన్ విత్ 76
ఒకే టీమ్ కు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ రెండు వేర్వేరు బడా మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి సేమ్ స్కోర్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ కూడా అదే చేశారు. గత టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో విరాట్ 59 బంతుల్లో 76 కీలక పరుగులు చేసి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

What is Special connection with 76 Between Kohli and Rohit In Last Two ICC Event Finals

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లోనూ రోహిత్ 83 బంతుల్లో ఏడు బౌండరీలు, మూడు సిక్స్ ల సాయంతో సరిగ్గా 76 కీలక పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. అలా ఇద్దురు స్టార్ క్రికెటర్లు రెండు వేర్వేరు బడా ఐసీసీ ఈవెంట్స్ లో 76 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడం విశేషం.

ఛాంపియన్స్ ట్రోఫీలో రోకో ప్రదర్శన
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అలానే పాకిస్థాన్ పై అద్భుత సెంచరీ, ఆస్ట్రేలియాపై కీలక అర్ధ శతకం బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ టోర్నీ ముందు వరకూ వీరిద్దరూ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే బాగుండని చెప్పిన వారు... ఇప్పుడు భారత భవిష్యత్ క్రికెట్ కోసం కొనసాగాలని కోరుకుంటున్నారు.

Story first published: Monday, March 10, 2025, 12:28 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+