న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొలార్డ్‌కు గిఫ్ట్ఇచ్చి, సవాల్ విసిరిన అంబటి రాయుడు

By Srinivas

ముంబై: విండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సవాల్ విసిరాడు. నేను బాదిన 108 మీటర్ల కంటే పెద్ద సిక్స్ నువ్వు కొట్టగలవా అని పొలార్డ్‌ను రాయుడు చాలెంజ్ చేశాడు. మైదానంలో డ్యాన్స్, సరదా వ్యాఖ్యలతో పొలార్డ్ అభిమానుల్ని ఆకట్టుకుంటాడు.

తాజా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఆడుతున్నాడు. పొలార్డ్ 29వ పుట్టిన రోజు వేడుకలను గురువారం జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జట్టు సహచరుడు రాయుడు ఓ బ్యాటును పొలార్డ్‌కు బహుమతిగా ఇచ్చాడు.

What is Mumbai Indians' Ambati Rayudu's challenge for Kieron Pollard?

అదే సమయంలో సరదాగా ఓ సవాల్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచులో వరుణ్ ఆరోన్ వేసిన బంతిని రాయుడు 108 మీటర్ల సిక్సర్ బాదాడు. ఆ బంతి రాయుడు తల మీదుగా వచ్చింది.

మ్యాచ్ అనంతరం ఆ సిక్స్ బాదిన బ్యాటునే పొలార్డ్‌కి బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సరదాగా.. నేను బాదిన సిక్స్ కంటే పెద్దగా బాదగలవా అని సవాల్ చేశాడు. ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు పొలార్డ్ చెప్పాడు. ఇది ఇంటర్నెట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X