'మన్కడింగ్ ఔట్' అంటే ఏంటో తెలుసా?


హైదరాబాద్: 'మన్కడింగ్ ఔట్' అనే పదం సోమవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్ ' ఔట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
జోస్ బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో అశ్విన్ తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.

'మన్కడింగ్ ఔట్' అంటే ఏంటి?
క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్ రనౌట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. అయితే దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది.

1948లో ఆసీస్ భారత పర్యటనలో
1948లో ఆసీస్ భారత పర్యటనలో భాగంగా భారత బౌలర్ వినో మన్కడ్ ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్‌ను ఇలాగే రెండుసార్లు ఔట్ చేశాడు. మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు.

బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత
దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ విధానాన్ని అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. అయితే అప్పటి ఆసీస్ కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్ ఈ విధానాన్ని అంగీకరించడం కొసమెరుపు. అనంతరం భారత బౌలర్ పేరుతోనే ఈ విధానానికి మన్కడింగ్ అని పేరు పెట్టారు.

బౌలర్లకు అనుకూలంగా మారిన కొత్త నిబంధన
తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజు దాటినప్పుడు బౌలర్ ఒకసారి హెచ్చరించిన తర్వాత ఔట్ చేయొచ్చు. 2017 నవంబర్ తర్వాత ఈ నిబంధనలో మార్పు చేశారు. కానీ సవరించిన నిబంధనలో యాక్షన్ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. దీంతో బట్లర్‌ను హెచ్చరించకుండానే పంజాబ్ కెప్టెన్ ఔట్ చేశాడని తెలుస్తోంది. అయితే ఇది క్రీడాస్పూర్తి విరుద్దమని, ఈ నిబంధనను తొలిగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

వినూ మన్కడ్ పేరు మార్చాలని మండిపడ్డ గవాస్కర్
ఈ మన్కడింగ్ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) సూచించారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications